RELATED NEWS
NEWS
సమైక్యాంద్ర కు మద్దత్తు గా డల్లాస్ ప్రవాసాంద్రుల సమైక్య వన భోజనాలు

 

 

 CLICK HERE FOR MORE డల్లాస్ ప్రవాసాంద్రుల సమైక్య వన భోజనాలు Photos

 

 

సమైక్యాంద్ర కు మద్దతుగా డల్లాస్ సమైక్యాంద్ర పరిరక్షణ సమితి ఆద్వర్యములో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైన సమైక్య వన భోజనాలకు ప్రవాసాంద్రులు తమ కుటుంబాలతో సహా తరలి వచ్చారు. దాదాపు 1000 నుంచి 1200 వందల మందికి పైగా ప్రవసాంద్రులు తెలుగు జాతి కలసి వుండాలని కోరుతూ సమైక్యాంద్ర కోసం ఆంధ్ర ప్రదేశ్ లో పోరాడుతున్న ప్రజలకు మద్దత్తుగా లూయిస్ విల్లి లేక్ పార్క్ కు తరలివచ్చారు. కార్యక్రమంలో వనభోజన నిర్వాహకులు ఇచ్చిన జై సమైక్యాంద్ర నినాదాలు గల ప్రత్యేక టీ -షర్టు లు ధరించి అతిధులు, పిల్లలు, యువకులు, పెద్దలు పాల్గొని ఆద్యంతమూ సమైక్య గీతాలతో, ఆటలతో, ప్రసంగాలతో సమైక్య నినాదాలతో లేక్ పార్క్ దద్దరిల్లింది. నిర్వాహకులు తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రత్యేకముగా తయారు చేసి, ఆ సభాస్థలి ఏర్పాటు చేయడం సభకు హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకొన్నది !.

 


ఆంధ్ర ప్రదేశ్ లో AP NGOS తరపున సమైక్య ఉద్యమం కు నాయకత్వం వహిస్తున్న అశోక్ బాబు గారు ఇండియా నుంచి టెలి కాన్ఫరెన్స్ లో ప్రవాససభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఎక్కడో విదేశాలలో వున్నా మీరు ఆంధ్ర ఉద్యోగుల గురించి  అలోచిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సమైక్యాంద్ర ఉద్యమానికి ప్రవాసుల మద్దతు మాకు కొత్త శక్తినిస్తుందని, మనం గట్టిగా పోరాడి ఏట్టి పరిస్తితుల్లో రాష్ట్రము విడిపోకుండా చూడాలని తద్వారా ప్రజలు నష్టపోకుండా చూడాలని  అన్నారు .

 

 


 



ప్రవాసాంద్రులు వివిధ కార్యక్రమములతో ఈమెయిలు ఇంటర్నెట్ ద్వారా కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలకు నిరసన తెలపాలని విజ్ఞప్తి చేసారు. సమైక్య వనభోజనం కు  స్వర్గీయ ఎన్ టి రామరావు గారి సతీమణి నందమూరి లక్ష్మిపార్వతి గారు విచ్చేసి మాట్లాడుతూ... "కొందరి పదవి వ్యామోహం వల్లే  ప్రత్యేక నినాదం వచ్చిందని, అన్ని రాజకీయ పార్టీలు సమైక్యానికి కట్టుబడాలని అన్నారు. నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవం, ఐక్యత కోసం కృషి చేసారని, తెలంగాణ ప్రజలు అమాయకులని కొందరి నాయకులు వారికి సీమాంద్రులపై ద్వేషాన్ని నూరి పోశారని, ప్రజలు అందరికి కలిసి వుండాలని వుందని" అన్నారు. తెలుగు రాష్ట్రమన్నా, తెలంగాణా రాష్ట్ర మన్నా ఒకటే అని, మన ఆంధ్రప్రదేశ్ ని  విడిపోకుండా చేసి మొత్తం రాష్ట్రాన్నే తెలంగాణా రాష్ట్రం గానే పేరు మార్చుకోవచ్చు అని చెప్పారు.  



చిల్లకూరు గోపి, కిష్టపాటి రమణా రెడ్డి మాట్లాడుతూ.... సమైక్యం కోరుకొనే వారందరం ఎంతో సహనంగా ఉండి తెలంగాణా ఉద్యమం పై, ప్రజలపై ద్వేషం లేకుండా మనం సమైక్యానికి కృషి చేయాలన్నారు. వనభోజనాల ప్రధాన ఉద్దేశం కలసి పండుగ జరుపుకొని, కలసి భోజనం చేద్దాం, ఆలోచిద్దాం, అభిప్రాయాలు పంచుకొందాం, ఒకే మాటగా నడుద్దాము, కలసి వుంటే కలదు సుఖం, విడిపోతే నష్టపోతాము, చెడిపోతామని చెప్పడమే అన్నారు. 




చింతమనేని సుధీర్  మాట్లాడుతూ... మన రాష్ట్రం నుండి 42 మంది ఎంపీలూ వుండటం వలన రాష్ట్రానికి ఎక్కువ శాతం నిధులు కేటాయించవలసి వస్తుందని మన రాష్ట్రాన్ని విభజించి మనకు రావాల్సిన నిధులని తగ్గించటానికి కేంద్రం కుట్రపన్నిందని చెప్పారు.  లోకేష్ నాయుడు  మాట్లాడుతూ... తెలుగు జాతి గౌరవాన్ని ఎందరో మహానుభావులు నిలబెడితే కెసిఆర్ మాత్రం జాతిని రెచ్చగొట్టి, విడగొట్టి  దిగజారుస్తున్నారని తెలిపారు .



కోడూరు కృష్ణా రెడ్డి, బీంరెడ్డి ప్రతాప్ లు మాట్లాడుతూ.... ఆంధ్ర రాష్ట్ర విభజన ప్రజలకు విద్యుత్ కొరత కలిగించి ప్రాంతాల మద్య నీటి యుద్దాలను సృష్టిస్తుందని, రాష్ట్రము ఎంతో వెనుక బడుతుందని, వివిధ గణాంకాలతో సభికులకు వివరించారు. రాష్ట్రంలో వెనుకబడిన అన్ని ప్రాంతాలను కలిసి అభివృద్ది చేసుకుందామని వివరించారు. రాష్ట్రం ముక్కలు చెక్కలుగా విడిపోతే అన్ని ప్రాంతాలకు నష్టమని హెచ్చరించారు. రాష్ట్రంలోని ఒకొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన సహజ వనరులున్నాయని, కలిసి వుంటే ఆ వనరులను సక్రమంగా వినియోగించగలమని చెప్పారు.


తెలంగాణా ప్రాంతానికి చెందిన కలువల రావు గారు మాట్లాడుతూ... విదేశాల్లో కూడా  తెలుగు వారు ఎంతో ఐక్యముగా వున్నారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో కూడా అందరు ఐక్యముగా వుండాలని, తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షులు కెసిఆర్ ప్రజల్లో శాంతి సామరస్యాలను దెబ్బతీస్తూ వ్యవహరిస్తున్నారని అన్నారు.


మహేష్ ఆధిబొట్ల మాట్లాడుతూ.... "కెసిఆర్ పిచ్చి పిచ్చిగ మాట్లాడుతూ ప్రజలను అయోమయంకి గురిచేస్తున్నారని, హైదరబాద్ అందరిది, తెలంగాణా ఉద్యమం పేరుతో కోట్లు కలెక్షన్ లు చేసుకొన్నావు. ఇంక చాలు! ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టద్దని, రెచ్చగొడితే కెసిఆర్ కుటుంబాన్ని ప్రజలు హైదరబాద్ నుంచి బహిష్కరించే రోజు వస్తుందని హెచ్చరించారు.


ప్రముఖ ప్రవాస వైద్యులు Dr నవనీత కృష్ణ గారు, ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ... "ప్రజల ఆవేశాలను రెచ్చగొట్టి రాజకీయ పార్టీలు, వ్యక్తులు పబ్బం గడుపు కొంటున్నాయని, ఇరు ప్రాంతాల ప్రజల మనసులు కలిపే విధంగా సమైక్య ఉద్యమం నడిసి విభజన వాదుల ప్రయత్నాలను తిప్పికొట్టాలి అన్నారు. చివరగా సాయంత్రము 5 గంటలకు జరిగిన వనభోజన ముగింపు కార్యక్రమములో  Dr కొర్సపాటి  శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.... తక్కువ సమయంలో ఇంత మంది ప్రవాసాంద్రులు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, ఈ కార్యక్రమానికి భోజనం పంపిన వివిధ రెస్టారెంటులకు, హాజరైన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన కోఆర్డినేటర్ లు, వాలంటీర్లకు అభినందనలు తెలిపి, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో సమైక్య ఉద్యమానికి మద్దత్తుగా చేస్తామని తెలిపారు.
 

సమైక్యాంద్ర వన భోజనాలు నిర్వహించి తెలంగాణా, రాయలసీమ, కోస్తాంద్ర ప్రత్యేక వంటకాలతో ఆతిద్యం ఏర్పాటు చేసి తెలుగుజాతి అంతా ఒక్కటిగా వుండాలి అనే సందేశాన్ని చాటి చెప్పారు. వివిధ సాంసృతిక కార్యక్రమాలు నిర్వ హించారు.సమైక్యాంద్ర వన భోజన కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా చింతమనేని సుధీర్, భీమిరెడ్డి ప్రతాప్ రెడ్డి , కిష్టపాటి రమణారెడ్డి, పావులూరి వేణు, కోడూరు కృష్ణారెడ్డి, లోకేష్ నాయుడు, గోపి చిల్లకూరు లు వ్యవహరించారు. 


ఈ సమావేశము విజయవంతము అవడానికి డల్లాస్ ప్రవాసులు Dr కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, పావులూరి వేణు, భావి రెడ్డి శ్రీనివాస్, పోలవరపు శ్రీకాంత్, గుత్తా వెంకట్, చంద్ కాజ, మండవ శ్రీనివాస్, చేకూరి కేసి, అజయ్ గోవాడ, ఎన్ ఎం ఎస్ రెడ్డి, మండువ సురేష్, సుగన్ చాగర్లమూడి, బండారు సతీష్, వెంకట శరణు, కిరణ్ తుమ్మల, గడికోట భాస్కర్ రెడ్డి, శివ బలుసు, AVM శ్రీనివాస్, వెంకట నార్పల, శ్రీనివాస్ అడ్డా, వీరపనేని అనిల్, తిరుమల రెడ్డి, ఊర్మిండి నరసింహరెడ్డి, ఉప్పలపాటి కృష్ణారెడ్డి, పుట్లూరి రమణ, తోపుదుర్తి ప్రభంద్ రెడ్డి కృషి చేసారు. ఎలక్ట్రానిక్ మీడియా నుంచి పుట్టపర్తి కృష్ణ, ములుకోట్ల వెంకట్, నసీం షేక్ లు పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;