RELATED NEWS
NEWS
ప్రవాసాంధ్ర ప్రకాశ౦ జిల్లా వనభోజనోత్సవాలు, డల్లాస్ 2013

 


CLICK HERE FOR MORE PHOTOS

 

 

ప్రవాసాంధ్ర ప్రకాశ౦ జిల్లా వాసులు, లిటిల్ ఎల్మ్ పార్క్ లో ఎంతో ఉత్సాహా భరితంగా రెండో వార్షిక వనభోజనోత్సవాలు జరుపు కున్నారు. ఈ నెల 23వ తేదీన దాదాపు 200 మ౦ది ప్రవాసాంధ్ర ప్రకాశ౦ జిల్లా వాసులు డల్లాస్ చుట్టు పక్కల వున్న వివిధ నగరాల నుంచి వచ్చి లిటిల్ ఎల్మ్ పార్క్ లో కలుసుకున్నారు. వర్షాభావ కారణంగా ఇంకొంత మంది ఉత్సవంలో పాల్గొనలేకపోయారు. పొద్దున్న 10 గంటలకు మొదలైన ఈ వనభోజనోత్సవం సాయంత్రం 6 గంటలవరకు సాగింది.

 

ఉత్సాహవంతులైన ప్రకాశం జిల్లా వాసులు, ప్రకాశం జిల్లా మీద 'వందేమాతరం శ్రీనివాస్' పాడిన పాటతో ఈ ఉత్సవాన్ని మొదలు పెట్టారు. తరువాత అక్కడికి వచ్చిన వారు తమను తాము పరిచయం చేసుకున్నారు. పెద్దలు చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ వారికి ఇష్టం అయిన రాగిసంగటి అక్కడే వండి వేడి వేడీగా అతిధులకు వడ్డించారు. స్థానిక జల్సా రెస్టారెంట్ వారు పార్క్ లోనే వేడి వేడి వడలు, బొండాలు చేయించి అతిధులకు అందించారు. పిల్లలు గాలి పటాలు ఎగుర వేస్తూ చల్ల గాలులలకి ఆనందించారు.



కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో వివిధ ప్రాంతాల వాసులంతా ఇలా కలుసుకోవడం ఏంతో ఆనందంగా వుంది. అలాగే జిల్లాలో ప్రసిద్ధమైన అల్లురయ్య మిటాయిలు,చింతకాయ పచ్చడి, నాటుకోడి కూర, రాగి సంగటి ఇలా పార్కులో కలుసుకొని తింటుంటే ఉరిలో పొలాల గట్టు మీద తిన్న అనుభూతి కలిగింది అన్నారు. ఇంకొంతమంది, ఇలా ప్రతి సంవత్సరం రెండు సార్లు జిల్లా వాసులంతా కలుసుకుంటే బావుంటుందని అభ్ప్రాయం వెల్లబుచ్చారు. కొంతమంది అవుత్సాహికులు తమ జిల్లా కి ఏదయినా మంచి చేయాలని ముందుకి వచ్చారు. చివరగా కార్యవర్గ సభ్యులు, ఈ ఉత్సవంలో పాల్గొన్న వారికీ, వాలంటీర్లకు, ప్రోత్సాకులలకు వారి కృతజ్ఞతలు తెలియజేశారు.               
                           
 

TeluguOne For Your Business
About TeluguOne
;