అణు విద్యుత్ కేంద్రంలో మంటలు!

ఉక్రెయిన్‌‌లో యూరప్‌లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం వుంది. ఇందులో ఇప్పుడు మంటలు చెలరేగాయి. రష్యా ఆక్రమణ తర్వాత ఆ అణు విద్యుత్ కేంద్రం రష్యా అధీనంలో వుంది. ఈ ప్లాంట్‌లో రష్యన్ దళాలు పేలుళ్లు జరిపి మంటలు చెలరేగడానికి కారణమయ్యాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. రష్యా  మాత్రం ఉక్రెయిన్ సైనికులు ప్రయోగించిన ఫిరంగి గుళ్ళ కారణంగానే మంటలు వ్యాపించాయని అంటోంది. అణు విద్యుత్ కేంద్రంలో ప్రస్తుతం మంటలు మాత్రమే చెలరేగాయని, ఆ మంటలను చాలా శ్రమించిన మీదట ఆర్పేశామని సిబ్బంది చెబుతున్నారు. అణు లీకేజీ మాత్రం జరగలేదని, ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. 2022లో రష్యా సైనికులు ఉక్రెయిన్‌లోని ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి నిలిపేశారు. విద్యుత్ ఉత్పత్తి లేకపోయినప్పటికీ, సరైన నిర్వహణ లేకపోతే అణు లీకేజ్ జరిగే ప్రమాదం వుందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu