ఒకవైపు పాలన పరవళ్ళు.. మరోవైపు ప్రతీకార డిమాండ్లు!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు అయ్యింది. ఈ రెండు నెలలుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ప్రజలకు రాష్ట్ర అభివృద్ధితో పాటుగా సంక్షేమం కూడా పట్టాలెక్కిందన్న భావన కలిగింది.  జగన్ ఐదేళ్ల పాలనలో భష్టుపట్టిపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు సీరియర్ గా దృష్టి సారించారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నప్పటికీ.. సామాజిక పెన్షన్లను పెంచి చెప్పిన విధంగా ఒకటో తేదీకల్లా అందజేయడం ద్వారా చంద్రబాబు అందర్నీ ఆశ్చర్య పరిచారు. అంతే కాకుండా ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటిన్లను ప్రారంభించనున్నారు. అలాగే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కూడా అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాల ఖరారులో ఆయన నిమగ్నమై ఉన్నారు. చెప్పిన విధంగా ఒక్కో హామీనీ అమలు చేస్తూనే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడలో పెట్డడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే దిశగానూ వేగంగా ముందుకు దూసుకువెడుతున్నారు. మొత్తంగా ఈ రెండు నెలల్లోనే రాష్ట్రం పురోగమిస్తోందన్న నమ్మకాన్ని చంద్రబాబు పాలన ప్రజలలో కలిగించింది.  రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానం, రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ జగన్ ఎంత గొంతు చించుకున్నా జనం పట్టించుకోవడం లేదు. బాబు సమర్థ నాయకత్వంపై వారు విశ్వాసంతో ఉన్నారు. 

అయితే అనూహ్యంగా చంద్రబాబు ప్రభుత్వంపై తెలుగుదేశం క్యాడర్ నుంచే విపరీతమైన ఒత్తిడి వస్తోంది. వాస్తవాలను అర్ధం చేసుకోకుండా, ఓ రకమైన ఎమోషన్ లో తెలుగుదేశం కార్యకర్తలు జగన్ హయాంలో అక్రమార్కులందరికీ తక్షణం శిక్షలు పడిపోవాలని కోరుకుంటున్నారు. అంతే కాకుండా ఆ దిశగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్ల జగన్ హయాంలో తెలుగుదేశం కేడర్ నరకం చూసింది. వేధింపులకు, దౌర్జన్యాలకూ గురైంది. ఐదేళ్ల పాటు హింసను, దౌర్జన్యాలనూ భరించి తెలుగుదేశం క్యాడర్ గట్టిగా నిలబడింది. అందులో సందేహం లేదు. జగన్ హయంలో తమపై జరిగిన దాడులు, దౌర్జన్యాలకు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తగు విధంగా న్యాయం చేస్తుందనీ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయిన శక్తులను తగు విధంగా శిక్షిస్తుందని వారు సహజంగానే భావించారు. అది జరుగుతుంది కూడా. అయితే క్యాడర్ కోరుకుంటున్నట్లు ప్రతీకార చర్యలు ఉండవు. చేసిన తప్పులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. అందుకు సమయం పడుతుంది. ఆ విషయాన్ని క్యాడర్ అర్ధం చేసుకోవడం లేదు. తక్షణ చర్యలు ఉండాలని కోరుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు.

 తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలల అయిన తరువాత కూడా వైసీపీ హయాంలో దౌర్జన్యాలకు పాల్పడిన వారి ఇంకా ఎలంటి శిక్షలూ లేకుండా స్వేచ్ఛగా ఎందుకు ఉండగలు గుతున్నారు? అంటూ ప్రభుత్వంపై తెలుగుదేశం క్యాడర్  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది.  అయితే తెలుగుదేశం క్యాడర్  ఒక విషయం అర్ధం చేసుకోవాలి.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు మాత్రమే అయ్యింది. గత ఐదేళ్ల జగన్ అస్తవ్యస్థ, అరాచక పాలనలో వ్యవస్థలన్నీ పై నుంచి కింది దాకా భ్రష్టుపట్టిపోయాయి. ఆ వ్యవస్థలను ప్రక్షాళన చేయడానికే కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ఆ పని జరుగుతోంది. 

జగన్ దోపిడీ, దౌర్జన్య పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం కూటమికి అఖండ విజయాన్ని అందించారు. అంత మాత్రాన కూటమి సర్కార్ అధకారంలోకి రాగానే ప్రత్యర్థులపై పంజా విసరడానికి లైసెన్స్ ఇచ్చేసినట్లు కాదు. ప్రభుత్వం అదే పని చేస్తే జనం కూడా మెచ్చరు.  ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. జగన్ హయాంలో పార్టీ నాయకత్వం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. వేధింపులకు గురైంది. పార్టీ అధినేత చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసి 50 రోజులకు పైగా జైలులో నిర్బంధించింది.  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అనేక విధాలుగా వేధింపులకు గురి చేసింది. చివరకు ఆయన తల్లి భువనేశ్వరిని సైతం అనుచిత వ్యాఖ్యలతో అవమానించింది.  మొత్తం చంద్రబాబు కుటుంబం అంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి కల్పించింది. వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయాని చూసింది.  

ఇంకా పలువురు తెలుగుదేశం నేతలను జైలుకు పంపి చిత్రహింసలకు గురి చేసింది.  వాస్తవానికి తెలుగుదేశం నాయకత్వం గత ఐదేళ్లూ ఎటికి ఎదురీది పార్టీని కాపాడుకుంది.  అవమానాలను భరించింది. దూషణలకు గురైంది. జైలుకు వెళ్లింది.  జగన్ హయాంలో పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలు జరిగిన ప్రతి సందర్భంలోనూ పార్టీ అండగా నిలిచింది. అవసరమైన న్యా సహాయం అందించింది.  ప్రతిపక్షంగా దేశంలో ఏ పార్టీ ఎదుర్కోనన్ని ఇబ్బందులకు జగన్ హయాంలో తెలుగుదేశం ఎదుర్కొంది. అవేవీ అంత తేలిగ్గా మరచిపోయేవి కావు.  వాటన్నిటినీ అధిగమించి పార్టీకి ఘన విజయాన్ని తీసుకువచ్చారు. జగన్  పార్టీని   151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు.  జగన్ ను ఓడించడమెలాగో తెలిసిన నాయకత్వానికి జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతకవలు, అక్రమాలు, అన్యాయాలకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం ఎలా శిక్షించాలో కూడా తెలుసు. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. అంత వరకూ క్యాడర్ సంయమనం పాటించాల్సి ఉంది

.జగన్ హయాంలో పార్టీ నాయకత్వం, క్యాడరే కాదు, ప్రజలూ దోపిడీ, దౌర్జన్యాలకు గురయ్యారు. వారు  జగన్ అరాచక పాలనలో హద్దులు మీరిన వారిపై చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు సర్కార్ కు సమయం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. పార్టీ క్యాడర్ కూడా ఆ సమయం ఇవ్వాలి. అందుకు భిన్నంగా వ్యవహరించడం సమంజసం కాదు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu