కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి బైరా దిలీప్ చక్రవర్తి

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి పార్టీల అభ్యర్థిని ప్రకటించారు. బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు కూటమి ఖరారు చేసింది. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన బైరా ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న బొత్స సత్యనారాయణను ఢీకొట్టడానికి బైరా దిలీప్ చక్రవర్తిని ఎంపిక చేశారు. అన్ని విధాలుగా బలమైన అభ్యర్థిగా వున్న బైరా ఎంపిక సరైన నిర్ణయం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈనెల 30న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. వైసీపీ అభ్యర్థిగా నేడు బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu