ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు.. కొడాలి నాని ఇలాకాలో ఉద్రిక్తత

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి కోర్టులో చీవాట్లు తిన్నా వైసీపీకి బుద్ధి రాలేదు. తాజాగా గుడివాడ సమీపంలోని బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసి తమ అరచకానికి హద్దులే లేవని వైసీపీ మరోసారి రుజువు చేసుకుంది. కృష్ణా జిల్లా గుడివాడలో అధికార వైసీపీ కార్యకర్తల అరాచకానికి హద్దు లేకుండా పోతోంది. తాజాగా బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసారు. చంద్రబాబునాయుడు బొమ్మలూరుకు కిలోమీటర్ దూరంలో ఉన్న అంగులూరులో జరగనున్న మహానాడుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంగా మహానాడు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ శ్రేణులు తమ పార్టీ రంగులు పూసి వికృతానందం పొందారు.

ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బొమ్మలూరు చేరుకున్న తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులను తుడిచేసి పాలాభిషేకం చేశారు. అనంతరం మళ్లీ పసుపు రంగు వేశారు. తెలుగుదేశం మహానాడుకు ముందు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే వైసీపీ ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడుతోందని ఎమ్మెల్పీ బచ్చుల అర్జునుడు, పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆరోపించారు.  కాగా ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే వైసీపీ నేతలకు తెలుగుదేశం కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో బొమ్మలూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని దిగజారుడు రాజకీయాలకు ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేడయం మరో తాజా తార్కానమని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు.

మహానాడు బ్యానర్లు కనిపించకుండా వైసీపీ నేతల ఫ్లెక్సీలు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నది చాలక ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేడయం దుర్మార్గానికి పరాకాష్ట అని విమర్శించారు. బుధవారం ( ఈనెల 29)న గుడివాడలో తెలుగుదేశం మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడలో పసుపు పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా తెలుగుదేశం జండాలు, బ్యానర్లతో గుడివాడ మొత్తం పసుపు మయం అయిపోయినట్లుగా వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే అక్కసుతో వైసీపీ నేతలు తెలుగుదేశం బ్యానర్లకు అడ్డంగా వైసీపీ నేతల బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అది చాలదన్నట్లు ఏకంగా ఎన్టీఆర్ విగ్రహానికే వైసీపీ రంగులు పూశారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు మండి పడుతున్నాయి. గుడివాడ మహానాడు కొడాలి నాని పతనానికి నాంది కానుందని చెబుతున్నారు.   ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో జరిగే మహానాడును విజయవంతం చేసేందుకు  తెలుగుదేశం కార్యకర్తలు కంకణం కట్టుకుని   పని చేస్తున్నారు.