తిరుమలలో ఘనంగా భోగి వేడుకలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
posted on Jan 14, 2026 7:38AM

తిరుమలలో భోగి పండుగ సందర్భంగా బుధవారం ( జనవరి 14) వేకువజామునే ఆలయం ముందు అర్చకులు, సిబ్బంది భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఉత్తరాయణంలో మొదటిగా వచ్చే పండుగ భోగి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు. ప్రతి ఏడాది ఆలయం ముందు భోగి మంటలు వేసి భోగి వేడుకల్లో భక్తులను భాగస్వాములు చేయడం ఆనవాయితీ.
అందులో భాగంగానే బుధవారం (జనవరి 14) భోగి సందర్భం మహా ద్వారానికి ముందు భోగి మంటలు వేసి వేడుక నిర్వహించారు. అలాగే టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తిరుమలలో భోగి పండుగ జరుపుకున్నారు. తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో సిబ్బందితో కలిసి చైర్మన్ భోగి పండుగను జరుపుకున్నారు. భోగి వేడుకలు నిర్వహించారు. ీ సందర్భంగా ఆయన భోగి పండుగ అందరికీ భోగ భాగ్యాలు అందించాలని ఆకాంక్షించారు.