బెంగళూరే ఎందుకు.. అమరావతి ఉందిగా.. పారిశ్రామిక వేత్తలకు లోకేష్ పిలుపు!

ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవవనరుల శాఖల మంత్రి నారా లోకేష్ స్పీడ్ మామూలుగా లేదు. మాట ఇస్తే కట్టుబడి ఉంటారు. అభివృద్ధి, టెక్నాలజీలపై స్పష్టమైన అవగాహన ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన తండ్రి నారా చంద్రబాబునాయుడితో పోటీగా సాగుతున్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో  రాష్ట్రానికి ఎన్నో ఐటీ స్టార్టప్ లు వచ్చాయి. ఉద్యోగ, ఉపాధి కల్పనలో  అవి ఎంతో కీలకంగా మారాయి. 2019లో జగన్ సర్కార్ వచ్చే వరకూ ఆంధ్రప్రదేశ్ ఇటీ ఇండస్ట్రీ పరంగా హైదరాబాద్, బెంగళరులు, చెన్నై పుణెలతో పోటీ పడింది. అయితే జగన్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పరిస్థితి మారిపోయిందనుకోండి అది వేరే సంగతి. జగన్ హయాంలో ఐటీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలో ఐటీ ఉత్పత్తులు పడిపోవడానికి చెప్పిన గుడ్డు థీయరీ అప్పట్లో ఏ స్థాయిలో ట్రోలింగ్ కు గురైందో తెలిసిందే.వాస్తవానికి జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగానూ అధోగతి పాలైంది. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం వేసిన ప్రగతి బాటలను ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీకి సైబరాబాద్ నిర్మాణం ద్వారా చంద్రబాబు బలమైన పునాది వేశారు. దాంతో  ఐటీ రంగంలో  లక్షలాదిమందికి ఉద్యోగాలు లభించాయి.  ఐ‌టి రంగంలో తెలుగు యువత అల్లుకుపోయి ప్రపంచ వ్యాప్తంగా ఆ రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగింది.  

చంద్రబాబు వేసిన పునాదిపైనే హైదరాబాద్ అభివృద్ధిని  ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు విస్తరిం చాయి. ఇప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి గురించిన ప్రస్తావన వస్తే ముందుగా ఎవరైనా చంద్రబాబు పేరే చెబుతారు. అంత మాత్రాన చంద్రబాబు తరువాత అధికారం చేపట్టిన పార్టీలు, ముఖ్యమంత్రులు హైదరాబాద్ ను నిర్వీర్యం చేసి అభివృద్ధి ఆనవాలును తుడిచేయడానికి ప్రయత్నించలేదు. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్ కోసం అమరావతి రాజధానిగా  చంద్రబాబు వేసిన పునాదులను జగన్ సర్కార్ విధ్వంసం చేసింది.  కేవలం చంద్రబాబుకు గుర్తింపు వస్తుంది. పేరు వస్తుంది. ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్న దుగ్ధతోనే ఏపీని నో డెవలప్ మెంట్ స్టేట్ గా మార్చేశారు. జగన్‌ నిర్వాకం వలన గత  5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలోనూ చివరి నుంచి మొదటి స్థానంలోనిలిచింది.

రాజధాని అమరావతిని పూర్తి చేస్తే చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు మరింత పెరుగుతుందని మూడు రాజధానుల నాటకానికి తెరలేపి దానిని నిర్వీర్యం చేసింది జగన్ సర్కార్. అలాగే పోలవరం ప్రాజెక్టు పురోగతిని కూడా నిలిపివేసింది.  అదే విధంగా యువతకు అపార ఉపాధి అవకాశాలను కల్పించే ఐటీ రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది జగన్ సర్కార్.  చంద్రబాబు 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఐటీ మంత్రిగా  నారా లోకేష్ చొరవతో అనేక కంపెనీలు రాష్ట్రానికి తరలి వచ్చాయి.  అయితే జగన్ నిర్వాకంతో  ఆయన హయాంలో ఏపీ ఐటీ రంగంలో అధమ స్థానానికి పడిపోయింది. 

 విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో  ఐటీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు పరిచారు. విశాఖపట్నం, మంగళగిరిలు ఐటీ హబ్ లుగా అవతరించాయి. రాష్ట్రంలో స్టార్టప్ లు వెల్లువెత్తాయి. చంద్రబాబు విజన్ కు అప్పటి ఐటీ మంత్రి లోకేష్ చోరవ తోడైంది. అయితే రాష్ట్రంలో జగన్ సర్కార్ కొలువుదీరడంతోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగన్ అస్తవ్యవస్థ విధానాల కారణంగా రాష్ట్రానికి తరలి వచ్చినఒక్కటొక్కటిగా రాష్ట్రం నుంచి తరలిపోయాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ కుదేలైంది.   

అవును  జగన్‌ నిర్వాకం వలన ఐ‌టి ఎగుమతులలో దేశంలో ఆంధ్రప్రదేశ్  అట్టడుగు స్థాయికి  పడిపోయింది.  2021-2022 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ నుంచి రూ.11.59 లక్షల కోట్ల విలువ గల ఐ‌టి ఎగుమతులు జరిగితే వాటిలో ఆంధ్రప్రదేశ్‌ వంతు కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే!   బిహార్‌  ఏపీ కంటే మిన్నగా రూ.2,000 కోట్లు విలువల ఐ‌టి ఎగుమతులు చేసింది. అంటే బీహార్ కంటే దిగువన ఆంధ్రప్రదేశ్ నిలిచింది.  రాజస్థాన్, మద్యప్రదేశ్ రాష్ట్రాలు రూ.3,000 కోట్లు, వెనుకబడిన అస్సాం 24,000 కోట్లు, మేఘాలయ రూ. 35,000 కోట్లు, ఝార్ఖండ్ రూ.43,000 కోట్లు, హర్యాన రూ.52,000 కోట్లు, ఉత్తరప్రదేశ్ రూ.55,000 కోట్లుచేశాయి.  గోవా రూ.1,57,000 కోట్లు, తమిళనాడు రూ.1,58,000 కోట్లు, తెలంగాణ రూ.1,81,000 కోట్లు, మహారాష్ట్ర రూ.2,37,000 కోట్లు, అత్యధికంగా కర్ణాటక రూ.3,96,000 కోట్లు విలువల ఐ‌టి ఎగుమతులు చేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో మేలు చేశానని నిసిగ్గుగా చెప్పుకున్న జగన్‌ పాలనలో ఐటి ఉత్పత్తులు కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే.    2021-21 ఆర్ధిక సంవత్సరంలో సాఫ్ట్ వేర్ ఉత్పత్తులలో కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తొలి ఐదు స్థానాలలో నిలిచాయి. మొత్తం ఉత్పత్తుల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటా 88.57శాతం అయితే. ఇందులో ఏపీ వాటా 0.111 శాతం  మాత్రమే. ఇదీ జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమ దుస్థితి. ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరింది. ఐటీ రంగం పుంజుకుంటోంది. పరిశ్రమలు తరలిరావడానికి సానుకూల వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు విజన్, లోకేష్ చొరవతో  రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ఐటీ పరిశ్రమలను ఏపీకి అహ్వానిస్తూ బెంగళూరు ఎందుకు అమరావతి ఉండగా అంటూ ఇచ్చిన పిలుపు తెగ వైరల్ అవుతోంది. 

ఇంతకీ ఆయన ఏ సందర్భంలో ఆ పిలుపు ఇచ్చారంటే.. బెంగళూరులో సిద్దరామయ్య సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తోందంటూ పలు కంపెనీలు ఆ నగరం నుంచి తరలిపోవాలన్న యోచనలో ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త దాస్ పాయ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వెంటనే స్పందించిన నారా లోకేష్ ఆయననే కాదు ఐటీ ప్రముఖులందరికీ ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పారు. పెట్టుబడులతో వస్తే అన్ని మౌలిక సదుపాయాలూ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన పిలుపు వెంటనే వైరల్  అయ్యింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం లోకేష్ పిలుపునకు సానుకూలంగా స్పందించారు. దేశానికి మరో బెంగళూరు అవసరం ఉందని పరోక్షంగా అమరావతిని పేర్కొంటూ ప్రకటన కూడా చేశారు. బెంగళూరు అవసరం ఉందని ప్రకటించారు.  పలు కంపెనీలు బెంగళూరు తరువాత తమ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అని బాహాటంగానే చెబుతున్నాయి. కొత్త కంపెనీలు, స్టార్టప్ లు అయితే అమరావతే తమ ఫస్ట్ డెస్టినేషన్ అంటున్నాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఐటీ పరిశ్రమ బెంగళూరు, హైదరాబాద్ కు దీటుగా ఎదుగుతుందని పారిశ్రామిక వేత్తలు సైతం అంచనా వేస్తున్నారు.