ఇకనుండి వాట్సప్ లో పోలీస్ కంప్లైట్స్..
posted on Jun 8, 2016 3:10PM
.jpg)
రోజు రోజుకి వాట్సాప్ వాడకం బాగా పెరిపోతున్న సంగతి తెలిసిందే. ఏ సమాచారం కావాలన్నా.. ఏదైనా వాట్సప్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వాట్సాప్ సౌకర్యాన్ని విశాఖ వాసులు కూడా వాడుకోవాలని నిర్ణయించున్నారు. ఈ నేపథ్యంలోనే ఇకనుండి పోలీస్ స్టేషన్లకు వెళ్లి కాగితం పై రాసి ఫిర్యాదులు చేసే అవసరం లేకుండా.. వాట్సప్ ద్వారా కూడా పోలీసులకి ఫిర్యాదులు పంపే సౌకర్యం అందుబాటులో తెచ్చారు. డీఐజీ శ్రీకాంత్ విశాఖలో పోలీసులకు సంబంధించిన యాప్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు మరింత చేరువగా తమ సేవలను అందించేందుకు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఏ సమయంలోనైనా వాట్సప్ నెంబర్- 8142003339కి తమ ఫిర్యాదులు పంపవచ్చని ఆయన తెలిపారు.