వచ్చే ఆసియాకప్ మేం నిర్వహిస్తే ఓకేనా?..ఐస్‌లాండ్
posted on Oct 20, 2022 1:09PM
ప్రపంచక్రికెట్‌లో ఆసీస్, ఇంగ్లండ్ పోటీల తర్వాత అంత ప్రాచుర్యం పొందినవి, క్రికెట్ వీరాభిమానులు వేలం వెర్రిగా చూసేవి, అత్యంత ఉత్కంఠభరితంగా జరిగేవి భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లే. అవి టెస్ట్‌లయినా, వన్డేలయినా టీ.20లయినా సరే. అయితే చాలాకాలం నుంచి ఇరు దేశాల మధ్య రాజకీయ కారణాల వల్ల మ్యాచ్‌లో అటు పాక్‌లో, ఇటు భారత్‌లోనూ ఇరు జట్లమధ్య జరగడం లేదు. ఏ టోర్నీలోనయినా సరే వేరే వేదికల మీదనే ఈ రెండు జట్లు తలపడుతూన్నాయి. కాగా ఇటీవల బీసీసీఐ ప్రధాన కార్య దర్శి జై షా ఒక ప్రకటన చేశారు. 2023 ఆసియా కప్ పాకి స్తాన్‌లో జరిగితే భారత్ జట్టు పాల్గొన దని, వేరే వేదిక లో జరిగితేనే ఇరు జట్లు తలపడతాయని ప్రకటించారు. ఇందుకు ఐస్‌లాండ్ క్రికెట్ అసోసియేషన్ సమా ధానం ఇచ్చింది. తాము ఆ టోర్నీని నిర్వహిస్తే ఇరు జట్లకు ఇబ్బంది ఉండదు కదా! అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది.
ఇది ఐసిసి అధికారులన కొంత ఆశ్చర్యపరిచి ఉండవచ్చుగాని భారత్, పాక్ అభిమానులను పెద్దగా ఆకట్టు కోలేదు. కారణం ఇలాంటి ప్రకటనలు చాలా సహజం. ప్లేయర్ల మధ్య మాత్రం ఎంతో స్నేహ పూర్వక వాతా వరణమే ఉంది, ఉంటుం దని ఇరు జట్ల యాజమాన్యాలు చెబుతూంటాయి. కానీ రాజకీయ పరిస్థితుల కారణంగా కానీ ఇరు దేశాల్లో ఏ టోర్నీలోనూ ఇవి ఎదురుకావడం మాత్రం అధి కారులు ఇష్టపడటం లేదు.
గత మాసంలో కూడా పాక్, భారత్ మధ్య టెస్ట్ సిరీస్ ను తాము నిర్వహిస్తామని చేసిన ఆఫర్‌ను ఎవరూ అంతగా పట్టించుకోలేదని ఐస్‌లాండ్ క్రికెట్ అధికారులు అన్నారు. కానీ వచ్చే ఆసియా కప్‌ను తాము నిర్వ హించగలమని, పాక్‌లో నిర్వహించడానికి భారత్ అంగీకరించనపుడు తమ ఆఫర్ గురించీ ఆలోచిం చాలని ఐస్‌లాండ్ క్రికెట్ అధికారులు కోరుతున్నారు.