పిలిచార‌ని వెళ్లారు...ఆయాసం తెచ్చుకున్నారు!

తెల్లార‌గ‌ట్టే ఫోన్ వ‌చ్చింది..తెనాలి ప‌రుగున వెళ్లింది..తిరిగివ‌చ్చిన అక్క‌ని చిన్న‌కోడ‌లు అడిగితే,  మా వొదిన మధుర చీర కొంగు చూప‌డానికి పిలిచింద‌న్న‌ది ఓ యింటి పెద్ద కోడ‌లు. రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఇంటిప‌నిలో ప‌డింది. అదిగో అలా ఉంది తెలంగాణా సీ ఎస్ సోమేశ్ కుమార్ ఢిల్లీ ప‌య‌నం. 

అత్యంత ముఖ్యమైన సమీక్ష ఉందని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే ఢిల్లీకి రావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడం, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆగమేఘాలపై దేశ రాజధానికి వెళ్లడం, రెండు రోజుల  తరువాత తిరిగి రావడంపై ఐఏఎస్‌ అధికారులు సెటైర్లు వేసుకుంటున్నారు. ఏదో సామెత చెప్పినట్లుగా, వెళ్లారు.. వచ్చారు అని వ్యాఖ్యానిస్తున్నారు. సీఎస్‌ ఢిల్లీ పర్యటన వల్ల అనవసర ఆపసోపాలు తప్ప.. ఒరిగిందేమీ లేదని అంటున్నారు. 

ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపు రాగానే శ‌ర‌వేగంతో ప్ర‌త్యేక విమానంలో రాష్ట్ర‌ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్  ఢిల్లీ వెళ్లారు. తీరా అక్క‌డికి వెళ్లాక స‌మీక్షించాల్సిన అంశంలో పెద్ద త‌ల‌బాదుకోవాల్సిన అంశ మేమీలేద‌న్న‌ది అర్ధ‌మ‌యింది. అస‌లే రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్దిక ఇబ్బందుల్లో ఉంద‌ని, క‌ష్టాల్లో కూరుకు పోయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న కాలంలోనే ఆయ‌న విమానాల్లో ప్ర‌యాణాలు ఆగ‌మేఘాల‌మీద వెళ్ల డాలు అవ‌స‌ర‌మా అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఈ నెల 11న సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యా దవ్‌ అంత్యక్రియలకు హాజరు కావడానికి సీఎం కేసీఆర్‌ ఉత్తరప్రదేశ్‌కు వెళ్లడం, అటు నుంచి అటే ఢిల్లీకి వెళ్లడం తెలిసిందే. 

కాగా, సీఎం ఢిల్లీలోనే ఉండి.. సమీక్షల కోసమంటూ సీఎస్‌తోపాటు మరో ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికా రులను ఢిల్లీకి పిలిపించారు. దీంతో వారు హైదరాబాద్‌లో స్పెషల్‌ ఫ్లైట్‌ను బుక్‌ చేసుకుని మరీ వెళ్లారు. రెండు రోజులపాటు అక్కడే ఉండి మంగళవారం తిరిగొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చిన్నపాటి సమీక్ష నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి తప్ప,  ఇతర సీరియస్‌ రివ్యూలేవీ జరగలేదని అంటు న్నారు.  

ఎలాంటి ఎమర్జెన్సీ లేని సందర్భంలో ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ లను పిలిపించుకుని, అనవసరపు వ్యయాలు పెట్టడమేమిటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న సమీక్షల కోసం ఢిల్లీకి పిలి పించుకుని, అధికారుల విలువైన సమయాన్ని వృథా చేయడమే అవుతుందన్న చర్చ సాగుతోంది. ఇలాంటి దుర్భర వ్యయాల సొమ్మును ఇతరత్రా ప్రయోజనకర  పనులకు వినియోగించవచ్చు కదా! అని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu