వోట్ల బిచ్చగాళ్లు వచ్చేస్తున్నారు

రాజస్థాన్ ప్రజలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే ఎటువంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఎన్నికల వేళ వరాలు ప్రకటించడం షరా మామూలే. కానీ అవసరం లేకున్న వరాలు ప్రకటించి తీరా అధికారంలో వచ్చాక వాటిని మరుస్తున్న పార్టీ నేతలే ఎక్కువవుతున్నారు.  వచ్చే డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు గెహ్లాట్ . ముఖ్యమంత్రి ప్రకటనను ప్రతి పక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వోట్ల కోసం ఉచిత కరెంటు ప్రకటన చేసినట్లు ఆరోపిస్తున్నాయి. 

ఎన్నికలకు ముందు,  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారతదేశానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.  ప్రతి భారతీయ పౌరుడి బ్యాంక్ ఖాతాకు 15 లక్షల రూపాయలు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు.
వాస్తవికత మరోలా  జరిగింది.  రూ.15 లక్షలు ఖాతాలోకి  పడలేదు.
 ప్రజా సంక్షేమం కోసం చేసిన వాగ్దానాల అమలులో చిత్తశుద్ది కనిపించడం లేదు.  చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా జరుగుతోంది. కేవలం ఎన్నికల నేపథ్యంలో చేసిన వాగ్దానాలు చాలా సందర్భాల్లో వైఫల్యం చెందుతున్నాయి. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని కెసీఆర్ వాగ్దానం చేశారు. వాస్తవికతలో అలాంటిది జరగలేదు. 
పంటరుణాలను రూ లక్ష వరకు మాఫీ చేస్తానని కెసీఆర్ మరో వాగ్దానం చేశారు. ఆచరణలో అది కూడా సాధ్యం కాలేదు. 
తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని కెసీఆర్ హామి ఇచ్చారు. ఈ వాగ్దానం కూడా అమలు  జరగలేదు. 
కంపల్సరీ ఎడ్యుకేషన్ స్కీం క్రింద కెజీ నుంచి పీజీ ఉచిత విద్యనందిస్తానని కెసీఆర్ హామి ఇచ్చారు. కానీ ఆచరణలో అది కూడా సాధ్యం కాలేదు. 
గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని కెసీఆర్  వాగ్దానం చేసి తూట్లు పొడిచారు. 
ఒక్క తెలంగాణ రాష్ట్రంతో బాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికార పార్టీలు చేసే హామీలు, వాగ్దానాలు అమలు కావడం లేదు. 
వోట్ల కోసం ఆయా పార్టీలు వేసే బిస్కట్స్ అని ప్రజలు గ్రహించాలి.