అవినాష్ రెడ్డి కొంప ముంచిన పెదనాన్న ప్రతాప్ రెడ్డి

రోజుకో మలుపు తిరుగుతున్న వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా అజ్ణాత సాక్ష్యులు కీలక సమాచారాన్ని అందిస్తున్నారు. అజ్ణాత సాక్షుల సమాచారంతో సీబీఐ ఎప్పటికప్పుడు సరికొత్త సమాచారాన్ని జోడించి నివేదికలు తయారు చేస్తోంది. 2019 మార్చి 15వ తేదీన జరిగిన వివేకా హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీబీఐని తప్పించుకు తిరుగుతున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు నుండి ఉ;శమనం పొందుతున్నారు.

పులివెందులలో  పార్టీ కార్యక్రమాలున్నాయంటూ ఒక సారి, తల్లిగారికి ఆరోగ్యం బాలేదంటూ మరోసారి, తన తల్లికి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నానంటూ ఇంకో సారి, హైదరాబాద్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరుగుతోందని మరోసారని సీబీఐకు అవినాష్ ముఖం చాటేస్తూ వస్తున్నారు. అసలు అవినాష్ తల్లిగారి ఆరోగ్యం విషయంలో అవినాష్ వర్గం అసత్యాలు చెబుతోందని కూడా సీబీఐ అభిప్రాయపడిందని వార్తలు వెలువడ్డాయి. వృత్తిరిత్యా వైద్యురాలైన వివేకా కుమార్తె సునీత కూడా అవినాష్ తల్లిగారికి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పడం గమనార్హం. ఆ విషయం పక్కన పెడితే అవినాష్ వాయిదాలు వేసిన సమయాన్ని సీబీఐ చక్కగా వినియోగించుకుంది.

 కొంత మంది అజ్ణాత వ్యక్తులను, అంటే కేసుతో సంబంధం లేదని అందరూ అనుకుంటున్న వ్యక్తులను సీబీఐ ప్రశ్నించి కీలక వివరాలు సేకరించింది. వీరిలో మొదటి వ్యక్తి ఐఏఎస్ అధికారి కల్లం అజయ్ రెడ్డి. జగన్ కుటుంబానికి దగ్గరగా మసలే అజయ్ కల్లంను సీబీఐ ప్రశ్నించింది.  2019 మార్చి 15ం తేదీ లెల్లవారు జామున సుమారు 4.15 గంటలకు వివేకా చనిపోయారన్న విషయం తనతో జగన్ చెప్పారని అజయ్ కల్లం వెల్లడించారు.  2019 ఎన్నికల మేనిఫెస్టో తయారీ పనుల్లో ఉన్న తనతో జగన్ ఈ విషయాన్ని పంచుకున్నారని, చిన్నాన్న నో మోర్ అనే క్లుప్త సమాచారాన్ని తనకు అందించారని కల్లాం చెప్పుకొచ్చారు.  వివేకా హత్య కేసు డైరీలో ఆయన హత్యకు సంబంధించిన మొదటి సమాచారం 6.30గంటలకు పీఏ కృష్ణారెడ్డి ద్వారా సీఐ శంకరయ్యకు తెలిసింది.  తరువాతే ప్రపంచానికి తెలుసు అనేది ఎఫ్ఐఆర్ వివరణ. కానీ అంతకు ముందే లోటస్ పాండ్ కు ఎలా సమాచారం అందింది అనేది సీబీఐ ప్రశ్న. దీనికి సంబంధించి లోటస్ పాండ్ లో ఉన్న వారిని విచారించాలన్నది సీబీఐ వాదన.

ఇది మొదటి అజ్ణాత సాక్షి కథ. ఇక తాజా అజ్ణాత సాక్షి వివరణ ఇలా ఉంది. నేను వివేకా ఇంటికి వెళ్లినప్పుడు అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి అక్కడే ఉన్నారు. వివేకా శవం రక్తపుమడుగులో పడి ఉంది.  తండ్రీ కొడుకులు ఇద్దరూ రక్తపు మరకలు శుభ్రం చేస్తున్నారు. తరువాత వివేకా మృతదేహాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి, కట్లు కట్టి పడుకోబెట్టారు. ఇది మరో అజ్ణాత సాక్షి వైఎస్ ప్రతాపరెడ్డి సాక్ష్యం. వైఎస్ ప్రతాపరెడ్డి స్వయానా అవినాష్ రెడ్డికి పెదనాన్న, భాస్కరరెడ్డికి సొంత అన్న. ఈ కేసులో ఇంకా ఎంత మంది సాక్షులు బయటకు వస్తారో తెలీదు. కానీ వివేకా కేసు ఒక కేస్ స్టడీ. అతీంద్రియ వ్యక్తులు, అదృశ్య శక్తులు, అజ్ణాత సాక్షులు ఈ కేసును ఇంకా ఎన్నిమలుపులు తిప్పుతారో వేచి చూడాల్సిందే.