కోహ్లీ బాల్ ట్యాపరింగ్ పై సెహ్వాగ్ ఫైర్..
posted on Nov 24, 2016 11:33AM
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాల్ ట్యాపరింగ్ కు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. భారత్-ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ల మధ్య ఈ నెల 9 నుంచి 13 వరకు రాజ్‌కోట్ వేదికగా తొలి టెస్టు మ్యాచులో కోహ్లీ బాల్ ట్యాపరింగ్ కు పాల్పడ్డారని బ్రిటీష్ పత్రిక ‘ది డైలీ మెయిల్’ ఈ విషయాన్ని తమ పత్రికలో ప్రచురించింది. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని ఇప్పటివరకు ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు ఎలాంటి ఆరోపణలు చేయలేదని, బ్రిటీష్ మీడియా మాత్రం ఇలాంటి కథనాలు ప్రచురిస్తోందని సెహ్వాగ్ అన్నాడు. వారు చేస్తోన్నవి అర్థంలేని ఆరోపణలని, ఇటువంటి ఆరోపణలు చేయడం కన్నా విశాటపట్నంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ జట్టు పరాజయం పాలవడాన్ని గౌరవప్రదంగా అంగీకరించి ఉంటే ఆ దేశ క్రికెట్ జట్టు గౌరవం పెరిగేదని పేర్కొన్నాడు. పరాజయం పొందే జట్టు ఎల్లప్పుడూ పలు అంశాలను చూపిస్తూ సానుభూతి పొందాలని చూస్తుందని వ్యాఖ్యానించాడు.