నోట్ల రద్దుపై రాజ్యసభలో చర్చ..

 

ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభకు చేరుకున్నారు. పెద్ద నోట్లపై చర్చపై రాజ్యసభ అంగీకారం తెలపడంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెద్ద నోట్ల రద్దతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..నోట్ల రద్దుతో ఉగ్రవాదాన్ని, నల్లధనాన్ని నిర్మూలించవచ్చన్న వాదనను అంగీకరించను అని అన్నారు. క్యూలైన్ లో ఉండి 60 మంది చనిపోయారు.. ప్రభుత్వం నిర్మాణాత్మక ఆలోచనలతో ముందుకు రావాలి అని అన్నారు. వ్యవసాయం పారిశ్రామికి అభివృద్ధికి తీవ్ర అవరోధం ఏర్పడింది అని వ్యాఖ్యానించారు.