విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో చుక్కెదురు 

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. భీమిలి బీచ్ లో  సముద్ర తీరానికి సమీపంలో ఆమె కాంక్రీట్ గోడను నిర్మించింది. జగన్ హాయంలో అక్రమంగా కట్టిన  ఈ గోడను కూటమి ప్రభుత్వం కూల్చేయడానికి సిద్దమైంది. ఈ నేపథ్యంలో  తాను నిర్మించిన గోడ కూల్చొద్దని ఆమె హైకోర్టు నాశ్రయించారు.   స్టేటస్ కో ఇవ్వాలన్న వినతిని   హైకోర్టు తిరస్కరించింది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు  ఉండకూడదని ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును కోర్టు సమర్ధించింది. అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రక్రియ కొనసాగాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.