శ్రీవాణి దర్శనం టికెట్లు రద్దు.. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం
posted on Dec 26, 2025 1:21PM

తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవాణి దర్శన టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంటకేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి దేవదేవుడి దర్శనం కోసం నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సెలవుదినాలు, వారాంతాలలో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో తిరుమల భక్తులతో పోటెత్తుతోంది.
ఈ నేపథ్యంలోనూ టీటీడీ శ్రీవాణి దర్శనం టికెట్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మామూలుగా ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి భక్తులకు దాదాపు 30 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. అయితే ఆన్ లైన్ లో పూర్తి అయిన శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన వారిని అనుమతించనుంది. అంతే కాకుండా ఇక నుంచి ఆఫ్ లైన్ విధానాని రద్దు చేసి.. పూర్తిగా ఆన్ లైన్ విధానంలో దర్శన టిక్కెట్లు జారీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.