పుష్ప–2 తొక్కిసలాట…ఛార్జిషీట్ దాఖలు

 

సంధ్య  థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొత్తం  23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. ఏ-1గా సంధ్య  థియేటర్‌ మేనేజ్మెంట్, ఏ-11గా అల్లు అర్జున్‌ను పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలో పుష్ప–2 సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... ఈ కేసులో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటివరకు ఆ బాలుడు కోలుకోలేదు... ఘటన జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చుతూ అభియోగాలు నమోదు చేశారు.

ఈ ఘటన దేశవ్యా ప్తంగా తీవ్ర చర్చకు దారి తీయగా, పోలీసుల దర్యాప్తు లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిసినా కూడా సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు తమ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.
చార్జిషీట్‌లో అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది సభ్యులు, అలాగే 8 మంది బౌన్సర్లు నిందితుల జాబితాలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు చేరతారని తెలిసినా సరైన ముందస్తు ఏర్పాట్లు లేకుండా సంధ్య థియేటర్‌కు వెళ్లడం, భద్రతా వ్యవస్థను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించడమే నేరంగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసినట్లు ఛార్జిషీట్‌లో వివరించారు.

ఈ తొక్కిస లాట ఘటనకు సంధ్య థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రేక్షకుల నియం త్రణకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం, ప్రవేశ ద్వారాల వద్ద భద్రతా సిబ్బందిని సముచితంగా నియమించకపోవడం, ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్‌ను పాటించకపోవడం వంటి అంశాలు ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. ఈ కారణంగా థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్‌పైనా అభియోగాలు నమోదు చేశారు.ఈ దుర్ఘటనలో ఓ మహిళ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 

సినిమా చూడాలనే ఉద్దేశంతో థియేటర్‌కు వచ్చిన కుటుంబం ఇలా విషాదంలో మునగడం ప్రజల హృదయాలను కలిచి వేసింది. బాధిత కుటుం బానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో పలు వర్గాలు ఆందోళనలు కూడా వ్యక్తం చేశాయి. చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను కోర్టు స్వీకరించనుండగా, కేసు తదుపరి విచారణకు వెళ్లనుంది. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు ఎలా కొనసాగుతాయన్న దానిపై సినీ పరిశ్రమతో పాటు ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.భారీ జనసమూహాలు పాల్గొనే కార్యక్రమాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu