హరీశ్ రావు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు...కవిత షాకింగ్ కామెంట్స్
posted on Dec 27, 2025 3:13PM
.webp)
బీఆర్‌ఎస్ నేత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ ను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేశారని ఆరొపించారు. దీంతో అది బ్లాస్టింగ్ చేయడంతో 3, 5వ మోటర్లు పని చేయడం లేదు. హరీశ్ రావు నిర్వాకం వల్ల ఈ రోజు కేవలం 3 మోటర్లే పనిచేస్తున్నాయి అని అన్నారు. ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లాలో నిర్వహించిన ‘జాగృతి జనం బాటలో’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం రిజర్వాయర్, పంప్ హౌస్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కృష్ణా జలాలపై మాట్లాడిన కవిత, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా నది దాదాపు 300 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్నప్పటికీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు.తెలంగాణకు కృష్ణా నది నుంచి 550 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా, అందులో కనీసం 299 టీఎంసీలను కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాము వట్టెం రిజర్వాయర్‌ను పరిశీలించామని, అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు, వ్యవస్థలు ఎక్కడా పూర్తిగా నిర్మించలేదని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 6 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు అందించామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, అది నిజమేనని కవిత అన్నారు. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా భారతదేశంలోనే నెంబర్‌వన్ జిల్లా అని, అక్కడ 25 లక్షల ఎకరాలకు పైగా సాగు భూములు ఉన్నాయని స్పష్టం చేశారు.