మహాత్ముడి పేరుతో వచ్చిన ఉపాధి పథకాన్ని కాపాడుకోవాలి : సీఎం రేవంత్

 

జనవరి 5 నుండి దేశ వ్యాప్తంగా  మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం బచావో ఉద్యమం ప్రారంభించాలని CWC సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడుల్లికార్జున ఖర్గే సారథ్యంలో జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం ఈ మేరకు తీర్మానించిందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికంగా పేర్కొన్నారు. 

పేదవాడి ఆకలి తీర్చి, ప్రతి పౌరుడి ఉపాధికి హామీ ఇచ్చి, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన చేకూర్చే బహుళ ప్రయోజనాలతో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకా”న్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీవ్రంగా ఖండించిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. మహాత్ముడి పేరుతో తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని CWC  తీర్మానించింది. దీని కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu