దేశంలో వన్ మ్యాన్ షో...ప్రధానిపై రాహుల్ ఫైర్

 

కేంద్ర క్యాబినేట్‌లో నిర్ణయించకుండనే ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలిగించారని కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం రాహుల్  మీడియాతో మాట్లాడుతు నేరుగా ప్రధాని కార్యాలయం ఈ నిర్ణయం తీసుకోవడం పేదల హక్కులను కాలరాయడమేనన్నారు. మోదీ కోరుకుంటే అదే అమలవుతోందని అన్నారు. దేశంలో వన్ మ్యాన్ షో నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇలాంటి నియంతత్వ చర్యలపై పోరాటానికి కలిసి రావాలని ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. ప్రధాని  ఒంటి చేత్తో రాష్ట్రాలతో పాటు పేదల బతుకులపై దాడి చేశారన్నారు. నోట్ల రద్దు మాదిరిగా ఈ నిర్ణయం సైతం ఏక పక్షంగా తీసుకున్నారని తెలిపారు. వీబీ- జీ-రామ్ బిల్లుకు నిరసనగా త్వరలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని రాహుల్ తెలిపారు. 

జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు  లభించాయన్నారు. అటువంటి గొప్ప పథకాన్ని రద్దు చేయడం రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడేమనని రాహుల్ పేర్కొన్నారు.వీబీ-జీ-రామ్ జీ బిల్లుకు నిరసనగా జనవరి 5నుంచి ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకా  MGNREGA బచావ్ అభియాన్ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 

MGNREGA స్థానంలో ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వీబీ-జీ-రామ్-జీ బిల్లు గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి 125 రోజుల పని కల్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్" (వీబీ-జీ రామ్‌ జీ) బిల్లు ప్రవేశపెట్టింది. దీనికి పార్లమెంటు లోని ఊభయ సభలు ఆమోదం తెలిపాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu