సజ్జల ఎవరు?.. కర్రలతో చితక్కొట్టుడు.. ముస్లింలు తగ్గారా?.. టాప్ న్యూస్@ 1PM

వైఎస్ జగన్ పాలనపై సొంత జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన పూర్తిగా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన చూడనేలేదని వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను లాక్కుంటున్నారని ఆరోపణలు చేశారు. ప్రతి విషయంలో పెత్తనం చేయడానికి అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? అని డీఎల్ ప్రశ్నించారు.
---------
ప్రతి ఈ సంవత్సరం జరిగినట్లే ఈ ఏడాది కూడా దేవరగట్టులో హింస చోటు చేసుకుంది. మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవంలో రింగులు తొడిగిన కర్రలతో భక్తులు బీభత్సంగా కొట్టుకున్నారు. సుమారుగా ఈ హింసలో 50 మందికిపైగా భక్తులు తీవ్రగాయాలయ్యాయి. పలువురి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. క్షతగాత్రులను దేవరగట్టులో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రికి తరలించారు.
-----
నాలుగు రోజుల పసికందు మాయమైన ఘటన జీజీహెచ్‎లో చోటు చేసుకుంది. ఈ నెల 13వ తేదీన మహిళ ప్రియాంక బాబుకు జన్మనిచ్చింది. తల్లి పడుకుందని..బాబుని వార్డ్ బయటకు నాయనమ్మ తీసుకుని వచ్చింది. అమ్మమ్మ పసికందును పక్కన పెట్టి నిద్రపోయింది. దుండగులు బాబుని ఎత్తుకుని పారిపోయారు. నిద్రమత్తులో ఉన్న వారు ఒక్కసారిగా నిద్రలేచి చూసేసరికి బాబు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
---------
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శల వర్షం కురిపించారు.మోహన్ భగవత్ విజయదశమి ప్రసంగం అబద్ధాలు, సగం సత్యాలతో నిండి ఉందని ఒవైసీ ఆరోపించారు.జనాభా విధానం, ఆర్టికల్ 370 రద్దు ఇతర అంశాలపై భగవత్ వ్యాఖ్యలను ఒవైసీ విమర్శించారు.ముస్లిములు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని పునరావృతం చేశారని, కాని ముస్లిం జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉందని ఒవైసీ చెప్పారు.
------
హైదరాబాద్ నగరంలో మరో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 300 కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‎కు తరలించారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. 
---
మావోయిస్టు పార్టీలో అగ్ర నాయకుడుగా ఉన్న ఆర్కే ఆలియాస్ రామకృష్ణ మృతి చెందడం బాధాకరమని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. 2004 లో మావోయిస్టులు - ప్రభుత్వం మధ్య జరిగిన శాంతి చర్చల్లో ఆర్కే చాలా కీలక పాత్ర పోషించాడన్నారు. మావోల డిమాండ్‌లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించేలా ఆర్కే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడన్నారు హరగోపాల్. 
---------
దేశంలోని ఏపీ, తెలంగాణాలతో పాటు పలు రాష్ట్రాల్లో శనివారం భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశా రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీచేసింది.తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. కేరళలోని ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. 
-----
శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‌ప్లో 81,022 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,22,374 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 885 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 215.8070 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.
------
తన కుటుంబంలో ఆడపిల్ల జన్మించిన సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పెట్రోల్ పంపు యజమాని తన కస్టమర్లకు ఉచితంగా పెట్రోల్ పోశారు. బేతుల్ లో పెట్రోల్ పంపు యజమాని అయిన రాజేంద్ర సైనాని మేనకోడలికి ఆడపిల్ల పుట్టింది. తన మేనకోడలికి ఆడపిల్ల పుట్టిన సంతోషంలో పెట్రోల్ పంపు యజమాని అయిన రాజేంద్ర సైనాని తన కస్టమర్లకు అక్టోబరు 13వతేదీ నుంచి అక్టోబరు 15వతేదీ వరకు మూడు రోజుల పాటు అదనంగా ఉచితంగా పెట్రోలు పోశారు. 
-----
బ్రిటన్​ కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్​ అమెస్‌పై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తూర్పు ఇంగ్లాండ్​లోని ఓ చర్చ్​లో నియోజకవర్గం ప్రజలతో అమెస్​ భేటీ అయిన సమయంలోనే ఆయనపై ఈ దాడి జరిగింది. గుర్తుతెలియని దుండగులు అమెస్‌ను పలుమార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు