ఎక్కువ కాలం జీవించాలంటే ఇప్పుడే ఈ 5 మార్పులు చేసుకోండి..!
posted on Dec 26, 2024 9:30AM
ఎప్పుడైనా పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. మనిషి ఆయుష్షు వందేళ్లు అని చెబుతారు. ఒకప్పటి మహర్షులు, ఋషులు వందల ఏళ్లు జీవించగలిగారు. తరువాత మన ముత్తాతలు, తాతలు వందేళ్ళకు పైగానే జీవించారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ కాలమే ఉంటున్నా ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనిని బట్టి చూస్తే.. క్రమంగా మనిషి ఆయుష్షు తగ్గుతూ వస్తోందని చెప్పవచ్చు. పరిశోధనలతో పాటు.. సమాజంలో జరుగుతున్న మరణాల రేటు, మరణాల వివరాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే వెంటనే జీవితంలో 5 మార్పులు చేసుకోవాలి. అవేంటో తెలుసుకుంటే.
సమతుల ఆహారం..
ఆహారమే ఆరోగ్యం అని అంటారు. చాలా వరకు తీసుకునే ఆహారమే ఔషదంగా పనిచేసి చాలా రోగాలు నయం కావడంలో సహాయపడుతుంది. రోజూ సమతుల ఆహారం తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి పోషకాలు అందడంతో పాటు రోగనిరోధక శక్తి బలపడుతుంది. శరీరానికి శక్తి కూడా అందుతుంది. రోజులో కనీసం 5రకాల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలట.
గోధుమలు, ఓట్స్, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్ తో పాటూ అవసరమైన పోషకాలు, ప్రోటీన్ కూడూ ఉంటుంది. ప్రోటీన్ కోసం చేపలు, శనగలు, పప్పులు, జున్ను, పనీర్ వంటివి తినాలి. ఇవన్నీ శరీరానికి తగిన బలాన్ని ఇస్తాయి. శరీరంలో కండరాలను బలంగా ఉంచుతాయి.
ఫిట్ గా ఆరోగ్యంగా ఉండటానికి వీలైనంత తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవాలి. చక్కెర జోడించి చేసిన ఆహారం, ఉప్పు ఎక్కువ జోడించి చేసిన ఆహారం తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్ లో సోడియం, చక్కెరలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం గింజలు, ఆలివ్ నూనె, చేపలు తినాలి. ఇవి మెదడుకు కూడా చాలా సహాయపడతాయి.
వ్యాయామం..
రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. స్విమ్మింగ్, సైక్లింగ్ కూడా చేయవచ్చు.
నిద్ర..
కనీసం 7 నుండి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇది మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఒత్తిడి..
జీవితంలో ఎదురయ్యే చాలా రకాల సమస్యలకు ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడి లేకుండా చూస్తూ ఏ సమస్య అయినా చాలా తొందరగానే పరిష్కారం అవుతుంది. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేది ఒత్తిడే.. ద్యానం, శ్వాస వ్యాయామాలు, యోగ వంటివి ఫాలో అయితే ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు.
నీరు..
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి నీరు చాలా అవసరం. శరీరం హైడ్రేటెట్ గా ఉండాలన్నా, శరీరంలో వ్యర్ఖాలు బయటకు వెళ్లిపోవాలన్నా రోజూ తగినంత నీరు తాగుతుండాలి. దీని వల్ల శరీరానికి సరైన శక్తి లభిస్తుంది.
*రూపశ్రీ.