పెట్రోల్ ట్యాంకులో పడి ముగ్గురు మృతి

పెట్రోల్ ట్యాంకులో పడి  ముగ్గురు మరణించి విషాద ఘటన అన్నమ్య్య జిల్లా రాయచోటిలో జరిగింది. పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు చెబుతున్నారు.

రాయచోటి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పెట్రోల్ పంప్ లో ట్యాంకర్ క్లీన్ చేయడానికి చమురుకంపెనీ హిందూస్థాన్ పెట్రోలియం యాజమాన్యం కడప నుంచి ముగ్గురిని ఇక్కడకు పంపింది. వారు పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ప్రమాద వశాత్తు ఒకరు అందులో పడిపోయారు.

అతడిని రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా ట్యాంక్ లో పడిపోయారు. వెంటనే అగ్నిమాపక దళం ఒకరిని బయటకు తీసింది. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మరణించారు.

ట్యంకులో పడిన మరో ఇద్దరిని అగ్నిమాపక దళం బయటకు తీసే సరిగే విగత జీవులయ్యారు.  ఈ సంఘటనపై బషీర్ ఖాన్ పెట్రోల్ బంక్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.