తెలంగాణలో స్తంభించిన రవాణా శాఖ సేవలు

 

తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖకు సంబంధించిన వాహన్-సారధి సేవలు మళ్లీ మొరయిస్తున్నాయి.
తెలంగాణలో వాహనం రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, నేమ్ ట్రాన్స్‌ఫర్, ఫిట్‌నెస్ వంటి కీలక సేవల కోసం ఉపయోగించే వాహన్–సారథి సెంట్రల్ సర్వర్ మరోసారి పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి జంటనగరాలతో సహా అన్ని జిల్లాల్లోని ఆర్‌టిఓ కార్యాలయాలకు చేరుకున్న వాహనదారులు  క్యూ లైన్లోనే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. 

సెంట్రల్ సర్వర్ కనెక్టివిటీ సమస్యలతో ఏ పని ముందుకు సాగకపోవడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికా రులు కూడా ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నారు. సెంట్రల్ సర్వర్ స్పందించడం లేదని అధికారులు స్పష్టం వ్యక్తం చేశారు మా చేతుల్లో లేదు ఢిల్లీ లెవెల్ లో సమస్య ఉంది.. దానిని ఢిల్లీ స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుందని మాత్రమే అధికారులు చెబుతున్నారు. 

దీంతో కార్యాలయాల్లో వాహనదారులు, స్టాఫ్ అందరూ నిరాశతో గడిపే పరిస్థితి ఏర్పడింది.కాగా, వాహన్–సారథి వ్యవస్థలో ఇదే తరహా అంతరాయాలు గత కొంతకాలంగా పునరావృతం అవుతుండటం ప్రజా సేవలపై ప్రభావం చూపుతున్నట్లు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకొని, సేవలను నిరాటంకంగా అందించేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. రవాణా శాఖ సారధిలో తలెత్తిన సాంకేతిక సమస్యలు త్వరలో పరిష్కరమవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో సాంకేతిక సమస్యలపై మంత్రి అధికారులతో మాట్లాడారు. సాంకేతిక సమస్యలు 3 గంటల్లో పూర్తిగా పరిష్కరమవుతాయని పొన్నం తెలిపారు.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu