అమ్మకానికి పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్!

పాకిస్థాన్  ఆర్థిక సంక్షోభం పీక్స్ కు చేరింది. ఆ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఐఎంఎఫ్ ఆర్థిక సహాయం తప్పని సరి. అయితే పాకిస్థాన్ ఆర్థిక అరాచకత్వంపై ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేసిన ఐఎంఎఫ్ పాక్ ను ఆదుకోవడానికి విధిస్తున్న ప్రతి షరతుకూ పాకిస్థాన్ తలొగ్గక తప్పడం లేదు. ఆ క్రమంలోనే ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ) ఒత్తిడికి తలొగ్గి తన జాతీయ విమానయాన సంస్థను అంగడి సరుకుగా మార్చేసింది. ఔను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను పాకిస్థాన్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఇందు కోసం ఈ నెల 23న బిడ్డింగ్ నిర్వహించనుంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థలోని వాటాలను పూర్తిగా అమ్మేయడానికి ఈ బిడ్డింగ్ జరగనుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయంగా ప్రకటించారు. అంతే కాదు ఈ బిడ్డంగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని కూడా సెలవిచ్చారు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థలోని 51శాతం నుంచి వంద శాతం షేర్లు అమ్మేయడానికి ఈ బిడ్డింగ్ జరగనుంది. పాకిస్థాన్ కు 7 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ అందించడానికి ముందుకు వచ్చిన ఐఎంఎఫ్.. ఆ ప్యాకేజీ అందించాలంటే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను పూర్తిగా ప్రైవేటు పరం చేయాలంటూ విధించిన షరతు

మేరకే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. అన్నిటి కంటే ఆశ్చర్యం ఏమిటంటే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ కోసం బిడ్డింగ్ కు అర్హత సాధించిన నాలుగు కంపెనీలలో ఒకటి పాకిస్థాన్ నియంత్రణలో ఉండే ఫౌజీ ఫౌండేషన్ కు చెందిన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఒకటి కావడమే. మొత్తంగా పాకిస్థాన్ ఆర్థిక సుడిగుండంలోంచి బయటపడేందుకు ప్రభుత్వ సంస్థలను అయిన కాడికి అమ్మేయాల్సిన దృస్థితికి దిగజారింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu