అఖండ2 సినిమా టికెట్@ రూ.5లక్షలు.. కొన్నదెవరో తెలుసా?
posted on Dec 5, 2025 9:06AM

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అఖండ-2 సినిమా మానియా జోరుగా ఉంది. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా అఖండ తాండవం చూడటం కోసం అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు. అయితే.. ఈ రోజు విడుదల కావలసిన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడింది. అది పక్కన పెడితే బాలకృష్ణ నటించిన ఈ సినిమా టికెట్ ఐదు లక్షల రూపాయలకు ఒక ఎమ్మెల్యే కొనుగోలు చేయడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.
అలా కొనుగోలు చేసింది మరెవరో కాదు.. ఎమ్మెల్యే జగన్ మోహన్. ఈ సందర్భంగా ఆయన ఓ అభిమానిగా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చిత్తూరుఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. బాలకృష్ణ అభిమానుల కోరిక మేరకు నగరంలో బాలకృష్ణ పేరుతో బస్సు షెల్టర్ నిర్మాణం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.