విమానానికి బాంబు బెదరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో టెన్షన్ టెన్షన్
posted on Dec 5, 2025 11:46AM
.webp)
శంషాబాద్ విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక వైపు పెద్ద సంఖ్యలో ఇండిగో విమా నాలు రద్దు అవుతుండటంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగుతున్నారు. దీంతోనే విమానాశ్రయంలో నిన్న రాత్రి నుంచీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక ఈ రోజు ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇకే 526 విమానానికి బాంబు బెదరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలోనే కాకుండా, టెర్మినల్ లో కూడా తనిఖీలు నిర్వహించారు. విమానాల రద్దుతో తీవ్ర అసహనంతో ఉన్న ప్రయాణీకులు ఈ తనిఖీల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలే ఓ వైపు విమానాల రద్దుపై ప్రయాణీకులు నిరసనలు, నినాదాలతో ఎయిర్ పోర్టు మార్మోగుతోంది. మరో వైపు బోర్డింగ్ పాస్ గేట్ వద్ద బైఠాయించి పలువురు నిరసనకు దిగారు. మొత్తంగా విమానాశ్రయం అంతా కిటకిటలాడుతోంది. ప్రయాణీకులకు కూర్చునే స్థలలం కూడా లేక నానా ఇబ్బందులూ పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సమయంలో టెర్మినల్ అంతటా ప్రయాణికులు భారీగా కిటకిటలాడు తున్నారు. కుర్చీలు లేకపోవడంతో పలువురు నేలపై కూర్చొని ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు తీవ్ర అసౌకర్యానికి గురవు తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భిగానే భద్రతా తనిఖీల వ్యవహారంలో కొందరు ప్రయాణీకులు సిఐఎస్ఎఫ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ఇలా ఉండగా ఈ రోజు ఇప్పటి వరకూ హైదరాబాదు నుంచి బయలుదేరాల్సిన 71 విమానాలు, రావాల్సిన 61 విమానాలు రద్దయినట్లు సమాచారం. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వందలాది మంది ప్రయా ణికులు ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఎమిరేట్స్ విమానంలో ఉన్న ప్రయా ణికులందరినీ భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రత్యేక ప్రాంతాలకు తరలించగా, విమానం మొత్తాన్ని బాంబ్ స్క్వాడ్ సూక్ష్మంగా పరిశీలించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అదనపు సిబ్బందిని మోహరించారు.