కోహ్లీ మానియాతో ఊగిపోతున్న విశాఖ

విశాఖపట్నం మొత్తం కోహ్లీ మానియాతో ఊగిపోతున్నది. విశాఖ వేదికగా  దక్షిణాఫ్రికాతో శనివారం (డిసెంబర్ 6) జరగనున్న మూడో వన్డే సందర్భంగా ఈ పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకూ విశాఖ వాసులు ఈ వన్డేపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఎప్పుడైతే కోహ్లీ రాంచీ, రాయ్ పూర్ లలో జరిగిన తొలి వన్డేలలోనూ శతకాలు బాది.. తాను మళ్లీ పూర్వపు కోహ్లీ మాదిరిగా పరుగుల వేట ఆరంభించానని చాటోడో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.  

విశాఖ వన్డే మ్యాచ్ వీక్షించాలన్న ఆసక్తి ఒక్క విశాఖ వాసుల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా వివరీతంగా పెరిగిపోయింది. ఇటువంటి స్పందన నభూతో అని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం  తొలి దశ టికెట్ల అమ్మకాలు గత నెల 28న  ప్రారంభమయ్యాయి. అయితే అప్పుడు టికెట్ల కోసం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ఆఫ్ లైన్ లో కౌంటర్లు ఏర్పాటు చేయక తప్పదేమోనని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ భావించింది. అయితే ఎప్పుడైతే రాంచీ, రాయ్ పూర్ లలో కోహ్లీ సెంచరీ చేశాడో.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  రెండో, మూడో దశ టికెట్లు నిమిషాల వ్యవధిలో అయిపోయాయి.

కోహ్లీ ఫామ్ లో ఉండటం, విశాఖ మైదానంలో కోహ్లీకి అద్భుత ట్రాక్ రికార్డు ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. విశాఖలో కోహ్లీ ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లు ఆడాడు. ఈ ఏడు మ్యాచ్ లలో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇవి కాకుండా రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో టికెట్ల ధరలు ఎక్కువ అని ఆలోచించకుండా అభిమానులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా కొనేశారు. అంతేనా గురువారం భారత జట్టు విశాఖ చేరుకుంది. ఈ జట్టు రాకకోసం అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్దకు చేరుకుని గంటల తరబడి వేచి చూశారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu