తెలుగు వన్‌కు 12 మిలియన్ సబ్‌స్క్రైబర్లు...ఘనంగా సంబరాలు

 

తెలుగు డిజిటల్‌ ప్రపంచంలో మరో గర్వకారణమైన మైలురాయిని తెలుగు వన్ ఛానల్ అందుకుంది. 12 మిలియన్ సబ్‌స్క్రైబర్లను చేరుకోవడంతో, హైదారాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఛానల్ ఎండీ రవిశంకర్ కంఠమనేని ప్రత్యేకంగా హాజరై సిబ్బందితో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు.

వేడుకల్లో భాగంగా రవిశంకర్ కేక్ కట్ చేసి అందరికీ  శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయానికి టీమ్ మొత్తం పెట్టిన కృషి, నిబద్ధత కారణమని పేర్కొన్నారు. “ఈ రోజు మనం జరుపుకుంటున్నది కేవలం ఒక మైలురాయి కాదు… మనపై ప్రేక్షకులు ఉంచిన విశ్వాసానికి ప్రతీక” అని చెప్పారు.

ఇటీవలి సిల్వర్ జూబ్లీ వేడుకలతో తెలుగు వన్ తాను సాగించిన 25 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా గుర్తుచేసుకున్నామని, ఇప్పుడు ఈ కొత్త విజయంతో మరొక మెట్టు ఎక్కినట్టేనని అన్నారు. సమాజానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడే కంటెంట్ అందించడం, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడం తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

“మన తదుపరి లక్ష్యం 20 మిలియన్లు కాదు… నేరుగా 34 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు. తెలుగు వన్‌కి దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నాం” అని రవిశంకర్ అన్నారు.సంస్థలో కష్టపడి పనిచేస్తే ఉద్యోగులకు మరింత మంచి భవిష్యత్తు సిద్ధంగా ఉంటుందని సిబ్బందిని ఉత్సాహపరిచారు. “25 ఏళ్ల క్రితం తెలుగు వన్‌కు వేసిన ఫౌండేషన్‌… ఇప్పుడు కోట్లాది మంది ప్రేమతో మహా వృక్షంగా మారింది. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుదాం” అని ఎండీ రవిశంకర్ తెలిపారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu