తెలంగాణ పోలీసు శాఖ లోగో మారింది!

తెలంగాణ పోలీసు శాఖ లోగో మారింది. మారిన లోగోను పోలీసు శాఖ విడుదల చేసింది. తెలంగాణ పోలీసు శాఖ ట్విట్టర్ లో కొత్త లోగోను పోస్టు చేసింది. పాతలోగోకు కొత్త లోగోకు కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నాయి. గత లోగోలో  తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉంటే.. ఈ కొత్త లోగోలో కేవలం తెలంగాణ పోలీస్ అని మాత్రమే ఉంది.  

రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ పతనమై కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తెలంగాణలో గతంలో ఉన్న అధికారిక పేర్లలో కీలక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా గతంలో తెలంగాణ రాష్ట్ర అంటే టీఎస్ అని అధికారిక చిహ్నాలలో ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తెలంగాణ స్టేట్ నుంచి తెలంగాణ అంటే టీజీగా మార్చింది.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు  గతంలో  టీఎస్( పేరును తొలగించి, టీజీ గా మార్పులు చేశారు. అదే దారిలో ఇప్పుడు  తెలంగాణ పోలీస్ కూడా తమ శాఖకు సంబంధించిన అధికారిక చిహ్నంలో  ఆ మేరకు మార్పులు చేసింది.  గత లోగోలో ఉన్న తెలంగాణ స్టేట్ పోలీస్  తొలగించి.. తెలంగాణ పోలీస్ అనే పేరుతో కొత్త లోగోను విడుదల చేసింది.