అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు కాసేపట్లో...

సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు. రెగ్యులర్ బెయిల్ మంజూరుకావడంతో వ్యక్తిగత పూచీ కత్తు సమర్పించడానికి ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. 
 పూచీ కత్తుకు సంబంధించిన పత్రాలను సమర్పించడానికి ఇక్కడికి వస్తున్నారు. చెరో 50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని  కోర్టు ఆదేశించింది. రెండు నెలల పాటు ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. సాక్ష్యలను , కేసును ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది. అల్లు అర్జున్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45   నివాసం నుంచి బయలు దేరినట్టు సమాచారం.