ఇంటర్ బోర్డు ఎదుట ఏబీవీపీ ధర్నా..

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కాకుండా సొంతగా నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 9వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను సొంతగా నిర్వహించానికి షెడ్యూలును కూడా విడుదల చేసింది. ఇంటర్ పరీక్షల విషయంలో తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. అయితే తెలంగాణలో విద్యార్థి సంఘాలకు ఈ నిర్ణయం రుచించినట్టు అనిపించలేదు. ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు బుధవారం నాడు ఇంటర్మీడియట్ బోర్డు ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షల విషయంలో గందరగోళాన్ని తొలగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను, విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.