కొమ్మినేని భారతం.. జగన్ దుర్యోధనుడని తేల్చేసిందిగా?

అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై  చేస్తున్నది అధర్మయుద్ధమని ఆయన పార్టీ నేతలే తెలిసో తెలియకో అంగీకరించేస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికలలో కూడా జగన్ అధర్మయుద్ధం చేసే తన పార్టీని గెలిపించారనీ చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇతిహాసాలను, పురాణాలనూ తీసుకువచ్చి వాటితో పోలుస్తూ జగన్ ను సమర్ధించుకోవడానికి వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు నవ్వుల పాలౌతున్నాయి. తాజాగా ఉంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ  చైర్మర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు రాసిన ఓ వ్యాసం ఆయనకు పురాణాల గురించి ఇసుమంతైనా తెలియదని చాటింది.

అంతే కాకుండా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ది మహాభారతంలో దుర్యోధనుడి లాంటి వ్యక్తిత్వం అని కొమ్మినేని శ్రీనివాసరావు తన వ్యాస్తం ద్వారా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇంత సూటిగా జగన్ ను కౌరవ అగ్రజుడిగా పేర్కొంటూ కొమ్మినేని శ్రీనివాసరావు రాసిన వ్యాసాన్ని జగన్ సొంత మీడియా తన ఆన్ లైన్ ఎడిషన్ లో ప్రముఖంగా ప్రచురించుకుంది.

 వైఎస్ విజయమ్మ వాస్తవాలు చూడలేని స్థితిలో ఉన్నారా? అనే శీర్షికన కొమ్మనేని శ్రీనివాసరావు వ్యాసంలో దివంగత వైఎస్ దృతరాష్ట్రుడు, విజయమ్మ గాంధారి, జగన్ దుర్యోధనుడు. ఔను ఆయన వ్యాసం సారాంశం క్లుప్తంగా, స్థూలంగా ఇదే.  ఇంతకీ కొమ్మినేని జగన్ ను సమర్ధిస్తున్నట్లా? విమర్శి స్తున్నట్లా?