గవర్నర్‌తో కేసీఆర్ మూడు గంటల భేటీ

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. రాజ్భవన్లో జరిగిన లంచ్ మీటింగ్లో గవర్నర్‌ని కలసిన సీఎం కేసీఆర్ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అధికారుల పంపిణీలతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం, విభజన సందర్భంగా ఏర్పడ్డ సమస్యలు తదితర అంశాలపై దాదాపు మూడు గంటలసేపు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.