అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు 

సంధ్య థియేటర్ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ  నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. 

 పుష్ప 2 బెనిఫిట్  షో చూడటానికి వచ్చిన అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. దీంతో చిక్కడపల్లి పోలీసులు అతనిపై బిఎన్ఎస్ 105 సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు  14 రోజులు రిమాండ్ విధించింది.  ఒక రోజు జైలులో ఉన్న అతను మరుసటి రోజు ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అడ్వకేట్లు వాదనలు వినిపించడంతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే  అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ బెయిల్ మంజూరైంది. రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కౌంటర్ దాఖలు చేసారు.  ఈ కేసులో వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ  శుక్రవారం తీర్పు ఇచ్చింది.