171 మంది రైతుల ఆత్మహత్య: పొన్నాల లెక్క...
posted on Sep 12, 2014 4:28PM
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 171 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో 30 మంది రైతులు కేసీఆర్ సొంత నియోజకవర్గంలో వున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య లెక్కలు బయటకి తీసి చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన పొన్నాల కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ అవసరం లేని విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారని, ఓ రకంగా చెప్పాలంటే నీరో చక్రవర్తిని తలపిస్తున్నారని పొన్నాల విమర్శించారు. ‘‘సీఎం కేసీఆర్ గద్దెనెక్కి వంద రోజులు దాటినా తెలంగాణలో కరవు, కరెంట్, రైతుల ఆత్మహత్యలను ఎంతమాత్రం పట్టించుకోలేదు. కేసీఆర్ ఆలోచనలు ఆకాశంలో, చేతలు పాతాళంలో వున్నాయి’’ అన్నారు.