దసరా నుంచి టీ హామీల అమలు

 

ఎన్నికల ప్రణాళికలో, అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలను దసరా నుంచి అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పెద్ద పండుగ దసరా కాబట్టి అప్పటి నుంచే పథకాలు అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే డేటా అంతా పూర్తిగా ప్రభుత్వానికి అందు బాటులో దసరా లోపే వస్తుంది. ఆ తర్వాత ఆ డేటాతో పథకాల అమలు సులభతరం అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.