మాధవిలతపై కేసు
posted on Jan 3, 2025 2:28PM
సినీ నటి , బిజెపి నేత మాధవిలత పై తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెన్నానది ఒడ్డున జెసిపార్క్ లో ప్రతీ యేడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ యేడు కూడా సెలబ్రేషన్స్ జరిగాయి. తాడిపత్రిలోని జెసి పార్క్ లో జరుగనున్న న్యూ ఇయర్ వేడుకలకు మహిళలు హాజరుకావొద్దని మాధవిలత పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపు తర్వాతే జెసి ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సులు దగ్దమయ్యాయి. ఇది బిజెపి పని అని జెసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అయితే తాను ఎలాంటి ఫిర్యాదు చేయనని పోలీసులే సుమోటోగా తీసుకోవాలన్నారు. తాడిపత్రి ప్రజల మనో భావాలు దెబ్బతినే విధంగా మాధవిలత వ్యాఖ్యలు చేసినందుకు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు కొందరు మహిళా కౌన్సిలర్లు . ఈ ఫిర్యాదు ఆధారంగా మాదవిలతపై కేసు నమోదైంది.