తెలంగాణ సీఎస్ గా ప్రదీప్ చంద్ర నియామకం..

 

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీ కాలం నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఈరోజు పదవికి వీడ్కోలు తెలుపనున్నారు. ఈనేపథ్యంలోనే  ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న ప్రదీప్ చంద్రను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం సచివాలయంలో సీఎస్ గా ప్రదీప్ చంద్ర బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ప్రదీప్ చంద్ర 1982 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. మద్రాస్ ఐఐటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో ప్రదీప్ చంద్ర పట్టభద్రుడు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెనేజ్‌మెంట్ కలకత్తాలో ఎంబీఏ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు.