500 లకే ఐఏఎస్ జంట పెళ్లి...
posted on Nov 30, 2016 3:18PM
పెద్ద నోట్ల రద్దుతో ఒక పక్క చిల్లర ఇబ్బందులతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ నోట్ల రద్దు వలన చాలా పెళ్లిళ్లు పీటల వరకూ వచ్చి ఆగిపోయాయి కూడా. అయితే ఈ నోట్ల రద్దు అయినా తమ పెళ్లి మాత్రం ఎవరూ ఆపలేరు అన్నట్టు కేవలం రూ.500 రూపాయలకే పెళ్లి చేసుకొని అందరికి ఆదర్శంగా నిలిచారు ఇద్దరు ఐఏఎస్ లు. వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆశిష్ వశిష్ట ప్రస్తుతం గోహాడ్‌లో ఎస్డీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆశిష్ వశిష్ట విజయవాడలో ఎస్డీఎంగా పనిచేస్తున్న సలోని సిదానాని పెళ్లి చేసుకున్నాడు. 2013లో ఐఏఎస్ పరీక్షను పాసైన వీరిద్దరు ముస్సోరిలో శిక్షణ సమయంలో ప్రేమించుకున్నారు. అయితే వీరు తమ వివాహానికి సంబంధించి అనుమతి ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్‌లోని బింద్ కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. కోర్టు వారికి నవంబర్ 28వ తేదిని కేటాయించింది. ఈ నేపథ్యంలో వారు పెళ్లి చేసుకున్నారు. అది కూడా కేవలం రూ. 500లకే. ఆ ఐదువందలు కూడా కోర్టు ఫీజుగా చెల్లించారు.