పవన్ కళ్యాణ్ పార్టీ అందుకే పెట్టాడు...
posted on Nov 30, 2016 2:06PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజలు పడుతున్న కష్టాలను ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చాలా సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ స్టాపించినా.. 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పార్టీ తరపున పోటీ చేయలేదు పవన్ కళ్యాణ్. కానీ బీజేపీ-టీడీపీ కి తన మద్దతు తెలిపి ఒక రకంగా గెలుపుకు కారణమయ్యాడు. అయితే ఈసారి 2019న జరగబోయే ఎన్నికల్లో మాత్రం ఆయన క్రియాశీలకంగా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలిపారు ఆయన సోదరుడైన నాగబాబు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయనను.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఎందుకు స్థాపించారు అని ప్రశ్న అడిగారు. దానికి నాగబాబు.. గొప్ప భావజాలం, మానవత్వం, గొప్ప గుణం పవన్ కు ఉన్న లక్షణాలని.. సాధారణంగా, ఏమీ చేయలేమనే నిరాశతో అనేక అంశాలను మనం వదిలేస్తుంటామని... కానీ, పవన్ కల్యాణ్ అలా కాదని... దేన్నీ అంత సాధారణంగా వదలడని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరినందుకో, అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లేకపోవడం వల్లో జనసేనను పవన్ స్థాపించలేదని తెలిపారు. ప్రజలకు అండగా నిలబడాలనే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని.. ఎవరైనా బాధ పడితే పవన్ తట్టుకోలేడని... ఎంతో నిరాశతోనే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టాడని తెలిపారు.