ఎక్స్ ప్లోజివ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ ఫ్యాక్టరీలో శనివారం (జనవరి 4) సంభవించిన భారీ పేలుడులో ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీ యాదగిరిగుట్ట మండలం కందుకూరులో ఉంది. ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో ఆ ప్రమాదం జరిగింది.  

పెద్ద శబ్దంతో పేలుడు సంభవించగానే కార్మికులు భయంతో ఫ్యాక్టరీ బయటకు పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మంది కార్మికులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా పేలుడు సంభవించిన ప్రాంతంలో ఇంకా ఎవరైనా కార్మికులు చిక్కుకుని ఉన్నారా లేదా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.