కాన్పూర్ టెస్ట్ లో భారత్ అద్భుత విజయం

బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో భారత్‌ గెలుపు
రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్
బంగ్లాదేశ్‌ స్కోర్లు 233 ఆలౌట్, 146 ఆలౌట్
భారత్‌ స్కోర్లు 285/9 డిక్లేర్డ్, 98/3

పేరుకి ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ కానీ వర్షం కారణంగా తొలి రోజు కేవలం 35 ఓవర్ల మ్యాచ్ మాత్రమే జరిగింది. రెండు, మూడు రోజుల ఆట పూర్తిగా వర్షార్ఫణమైంది. అయినా భారత్  బంగ్లాదేశ్ ను చిత్తు చేసి అద్భుత విజయం సాధించింది. ఈ క్రమంలో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో ఫైనల్ ఆడే అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. ఈ టెస్టులో విజయం సాధించడానికి భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. టి20లో కూడా చూడని అద్భుతమైన స్ట్రోక్ ప్లే ప్రదర్శించింది. ఔను భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ లో జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వర్షం కారణంగా రెండు రోజుల ఆట పూర్తిగా వాషౌట్ అయిపోయింది. తొలి రోజు కేవలం 35 ఓవర్లు మాత్రమే పడ్డాయి. అయినా భారత్ చివరి రెండు రోజుల్లోనూ చెలరేగి ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ పై 7 వికెట్ల ఆధిక్యతతో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి రోజు
వర్షం అంతరాయం కారణంగా దాదాపు రెండు రోజుల ఆట రద్దైన కాన్పూర్ టెస్టులో భారత్ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది.  ఈ విజయంతో బంగ్లాతో రెండు టెస్టుల సీరీస్ ను ఇండియా వైట్ వాష్ చేసింది.  
తొలత ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు ఆటలో 35 ఓవర్లు మాత్రమే వేయగలిగింది. ఆ తరువాత వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. తరువాత రెండు రోజులూ కూడా వర్షం కారణంగా ఒక్కటంటే ఒక్క బంతి కూడా పడకుండానే వాషౌట్ అయ్యాయి. తిరిగి నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులు చేసింది. ఈ స్థితిలో మ్యాచ్ నిస్సారమైన డ్రాగా ముగియడం ఖాయమని అంతా భావించారు. అయితే బ్యాటింగ్ లో ఇండియా అద్భుతమే చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా వేగంగా 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. నాలుగో రోజే బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేలా చేసింది. నాలుగో రోజు 45 నిముషాల సేపు బ్యాటింగ్ చేసిన బంగ్లా దేశ్ 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. ఐదో రోజు భారత బౌలర్లు బంగ్లాను  146 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక 95 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్ష్య ఛేదనలో జైస్వాల్ 51 పరుగుల, విరాట్ 29 పరుగులు చేశారు. రెండు ఇన్నింగ్స్ లోనూ బ్యాటింగ్ లో రాణించిన జైస్వాల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను అశ్విన్ దక్కించుకున్నాడు.