జగన్ చౌకబారు.. పవన్ హుందాయే వేరు!

తిరుమల లడ్డూ వివాదంలో  వైసీపీ అధినేత జగన్ ఎంత చౌకబారుగా వ్యవహరించారో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంత హుందాగా వ్యవహరించారు. లడ్డూ వివాదాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి జగన్ తాపత్రేయపడ్డారు. అందు కోసం చేయగలిగినన్ని ప్రయత్నాలు చేశారు. తిరుమల పర్యటనకు రెడీ అయ్యారు. లడ్డూ వివాదం నేపథ్యంలో తన పర్యటనను తెలుగుదేశం, జనసేన శ్రేణులు అడ్డుకుంటాయనీ తద్వారా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనీ జగన్ భావించారు.

అయితే జగన్ పర్యటనను అడ్డుకోబోమని జనసేనాని ప్రకటించడం, ప్రభుత్వం జగన్ తిరుమల పర్యటనకు అన్ని ఏర్పాట్లూ చేయడం, భద్రత కల్పించడంతో జగన్ వ్యూహం విఫలమైంది. అదే సమయంలో డిక్లరేషన్ వివాదం ఆయన మెడకు చుట్టుకుంది.  అన్యమతస్థుడైన జగన్ డిక్లరేషన్ ఇస్తేనే తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ స్పష్టం చేసింది. దీంతో జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తాను స్వయంగా తనంత తాను తిరుమల  పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వం తనను అడ్డుకుందంటూ ఎదురుదాడికి ప్రయత్నించారు. 

 మరో వైపు  ఇదే లడ్డూ ప్రసాదం విషయంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన జనసేనాని పవన్ కల్యాణ్ ఆ దీక్ష విరమణకు తిరుమల వెళ్లారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ప్రాయశ్చిత దీక్ష విరమించారు. అయితే ఆయన రెండో కుమార్తె అంజనా పననోవా హిందువు కాదు. కనుక ఆమె తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎ

టువంటి చర్చ, వివాదానికి తావు లేకుండా ఆమె డిక్లరేషన్ ఇచ్చారు. ఆమె  మైనర్ కనుక ఆమె డిక్లరేషన్ ఫారంపై పవన్ కూడా సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ  సోషల్ మీడియాలో షేర్ చేసింది.   లడ్డూ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత.. డిక్లరేషన్‌పై పెద్ద ఎత్తున చర్చ సాగిన విషయం విదితమే. పవన్ కల్యాణ్ చాలా హుందాగా ఆ చర్చకు తన చర్య ద్వారా సమాధానం ఇచ్చారు.