పది వేల కిలోమీటర్ల హైవేలు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 లో  దేశంలో 10,000 కిలోమీటర్ల హైవేలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, రవాణా వ్యవస్థను మరింత పటిష్ఠపరచడమే లక్ష్యంగా ఈ మేరకు ప్రణాళికను రూపొందించింది.

 కొత్త రహదారుల నిర్మాణం కారణంగా వ్యాపారం, ప్రయాణ సౌలభ్యం మెరుగు అవుతుంది. అలాగే పెట్టుబడులు పోటెత్తేందుకు దోహదపడుతుంది. తద్వారా ఆర్థిక వృద్ధి జరుగుతుంది.  ఈ ప్రాజెక్ట్ పూర్తైతే దేశంలో రహదారి మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి.