రెండు గూడ్సు రైళ్లు ఢీ.. జార్ఖండ్ లో ముగ్గురు సజీవదహనం

జార్ఖండ్ లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. ఫరక్కా నుంచి లాల్మాటియాకు వెడుతున్న గూడ్సు రైలు బర్హెట్ లో ఆగి ఉన్న మరో గూడ్సు రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం కాగా, మరో ఐదుగురు గాయపడినట్లు సమాచారం.

రెండు రైళ్లూ ఢీ కొనగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని లోకో పైలెట్ సహా ముగ్గురు సజీవదహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.