కుప్పం గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నియామకం!
posted on Apr 1, 2025 7:06AM

కుప్పం గంగమ్మఆలయ పాలక మండలి చైర్మన్ గా బీఎంకే రవిచంద్రబాబును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు.. ఆయనతో పాటు 10 మంది సభ్యులను కూడా ఎంపిక చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమైన ఆలయం కావడంతో ఈ ఆలయ పాలకమండలి నియామకం విషయంలో చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన స్వయంగా పాలకమండలి చైర్మన్, సభ్యులను ఎంపిక చేసి నియమించారు.
ఇక బీఎంకే రవిచంద్రబాబు విషయానికి వస్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన రెండేళ్ల పాటు కుప్పం నియోజకవర్గంలో అన్న క్యాంటిన్ నిర్వహించారు. జగన్ ప్రభుత్వ దమనకాండను, దాష్టీకాన్ని గట్టిగా ఎదిరించి నిలబడ్డారు. ఆలయ ప్రతిష్ఠ, పవిత్రతకు భంగం కలగకుండా గంగమ్మదేవాలయ పాలక మండలి ఉండాలన్న భావనతో చం్దరబాబు స్వయంగా కమిటీని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. కాగా బీఎంకే రవిచంద్ర చైర్మన్ గా 11 మందితో గంగమ్మ ఆలయకమిటీని నియమించిన చంద్రబాబు నేడో, రేపో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ కమిటీ ఎంపికలో చంద్రబాబు సామాజిక సమతుల్యత పాటించారని చెబుతున్నారు.