కుంభమేళా మోనాలిసాకు సినిమా చాన్స్ ఇచ్చిన దర్శకుడి అరెస్టు

తేనెకళ్ల సుందరి, మహాకుంభమేళా మోనాలిసాకు సినిమా చాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించి ఓవర్ నైట్ సెలెబ్రిటీగా మారిపోయిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిత్రా ఇప్పుడు మరో కారణంతో పాపులర్ అయ్యాడు. అత్యాచారం, అసభ్య  వీడియోలు తీసి బెదరించడం ఆరోపణలపై అరెస్టై మరో సారి వార్తల్లో నిలిచాడు. 

ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేలాలో.. జీవనోపాధి కోసం పూసల దండలు అమ్ముకుంటున్న ఓ యువతి కుంభమేళా మోనాలిసాగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆమెను అంతా తేనెకళ్ల సుందరి, మహాకుంభ్ మోనాలిసా అంటూ పిలవడం మొదలు పెట్టారు. దీంతో బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తన కొత్త సినిమా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ లో నటిగా ఎంపిక చేసుకున్నాడు.

మోనాలిసాకు సినీ చాన్స్ ఇచ్చి సనోజ్ మిశ్రా కూడా దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఆ పాపులారిటీ మసకబారిది. అత్యాచారం, అసభ్య వీడియోలు చిత్రీకరించి ఓ యువతిని వేధించిన కేసులో అరెస్టయ్యాడు. విషయమేంటంటే.. ఉత్తరప్రదేశ్ లోని 'ఝాన్సీ'నగరానికి చెందిన ఒక యువతి సనోజ్ మిశ్రా తనకు 2020 లో టిక్ టాక్,ఇన్ స్టాగ్రామ్ ద్వారా  పరిచయం అయ్యాడనీ,  సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మించాడనీ, ఆ తర్వాత రిసార్ట్ కి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి అసభ్య వీడియోలు చిత్రీకరించాడు.ఆ వీడియో లను చూపుతూ తనను  బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసాడనీ, పెళ్లి చేసుకుంటానని ప్రమాణాలు చేసి మోసం చేశాడనీ ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు సనోజ్ మిశ్రాను అరెస్టు చేశారు.  2014 లో  బేతాబ్ తో దర్శకుడిగా పరిచయమైన సనోజ్ మిశ్రా 'గాంధీగిరి, రామ్ కి జన్మ భూమి, లఫంగే నవాబ్,శ్రీనగర్,ది డైరీ ఆఫ్ బెంగాల్ వంటి చిత్రాలు తీశాడు. ఆయన తాజా చిత్రం కాశీ టూ కాశ్మీర్  విడుదలకు సిద్ధంగా ఉంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu