ఒక్కడన్నా చావాలి- తమిళనాడు పోలీసు
posted on May 23, 2018 10:46AM

తమిళనాట తూత్తుకుడిలో జరిగిన పోలీసు కాల్పుల్లో పదిమందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే! అక్కడ ఉన్న ఓ కంపెనీ తమ జీవితాలని నాశనం చేస్తోందని స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు రజనీకాంత్, కమల్‌హాసన్లు సైతం మద్దతు పలికారు. నిన్న ఈ ఆందోళన 100వ రోజుకి చేరిన సందర్భంగా పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనకారులు తూత్తుకుడి కలెక్టరేట్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరిపారు. అయితే పోలీసులు కాల్పులు జరపడంలో అత్యుత్సాహం చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సాక్ష్యంగా ఓ వీడియో క్లిప్ కూడా వైరల్ అవుతోంది. ‘కనీసం ఒక్కడన్నా చావాలి’ అని ఓ పోలీసు ఆవేశంగా అరవడం అందులో వినిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు తమిళనాట ప్రతిపక్షాలకి ఆయుధంగా మారనుంది.